https://oktelugu.com/

Sudheer- Rashmi: అది ఇవ్వాలా అని సుధీర్‌ను అడిగిన ర‌ష్మీ.. స‌ర‌సాలు ఎక్కువ‌య్యాయంటూ..

Sudheer- Rashmi: బుల్లితెరపై సుధీర్ రష్మి జోడి కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరు ఏదైనా షోలో ఉన్నారంటే ఆ షోకు విపరీతమైన రేటింగ్స్ వచ్చేస్తుంటాయి. ఈ టీవీ ఛానెల్ లో ఎవర్ గ్రీన్ జంట అంటే సుధీర్-రష్మీ అనే చెప్పుకోవాలి. వీరి డ్యాన్స్ కు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఒక స్టెప్పు వేశారంటే మిలియన్ల కొద్ది వ్యూస్ వేలల్లో కామెంట్స్ వస్తుంటాయి. ఇన్ని రోజులు ఈ […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 16, 2022 / 01:34 PM IST
    Follow us on

    Sudheer- Rashmi: బుల్లితెరపై సుధీర్ రష్మి జోడి కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరు ఏదైనా షోలో ఉన్నారంటే ఆ షోకు విపరీతమైన రేటింగ్స్ వచ్చేస్తుంటాయి. ఈ టీవీ ఛానెల్ లో ఎవర్ గ్రీన్ జంట అంటే సుధీర్-రష్మీ అనే చెప్పుకోవాలి. వీరి డ్యాన్స్ కు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఒక స్టెప్పు వేశారంటే మిలియన్ల కొద్ది వ్యూస్ వేలల్లో కామెంట్స్ వస్తుంటాయి. ఇన్ని రోజులు ఈ టీవీకి మాత్రమే చేయాలనే అగ్రిమెంట్‌ ఉండడంతో వీరిద్దరూ వేరే ఛానల్ లో కనిపించలేదు.

    Sudheer- Rashmi

    కానీ గత నెలతో ఈ అగ్రిమెంట్ ముగియడంతో ఇప్పుడు వేరే ఛానెల్ లో కూడా మెరుస్తోంది ఈ జంట. తాజాగా స్టార్ మా ఛానెల్ లో హోలీ ఈవెంట్ నిర్వహించగా అందులో ఈ జోడి కనిపించింది. అక్కడ కూడా ఎంట్రీ తోనే ఇద్దరూ డ్యాన్స్ చెప్పులతో ఇరగదీశారు. ఈ షోకు ఈ హోలీకి తగ్గేదే లే అనే పేరు పెట్టారు. ఇందులో చురాలియా అనే సాంగ్ ను సుధీర్ రష్మి కోసం పాడారు.

    Also Read:  తోడు లేక ఒంటరితనంతో బాధపడుతున్న హీరోయిన్లు వీళ్లే

    ఆ పాటకు రష్మీ కూడా ఎంతో మైమరచిపోతూ ఉన్నట్టు హావభావాలు పలికించింది. ఈ క్రమంలోనే యాంకర్ రవి కలగజేసుకుని నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తే సుధీర్ కోసం ఏం చేస్తావ్ అంటూ రష్మీని అడిగాడు. దానికి రష్మీ సిగ్గుపడుతూ సుధీర్ ని చూసింది. సుధీర్ కూడా చిన్నగా స్మైల్ ఇస్తూ ఉండగా.. ఇచ్చేయ‌మంటావా అంటూ సిగ్గులోలికింది. ఇక సుధీర్ కూడా ఆ ప్రశ్నకు కొంచెం అనుమానంగానే సమాధానం ఇస్తాడు.

    Sudheer- Rashmi

    కాస్తంత కెమెరా ముందుకు వచ్చి ఇచ్చేదేగా అంటూ నవ్వుతాడు. దాంతో రష్మి సుధీర్ చేతిపై కొడుతూ నీకు సరసాలు బాగా ఎక్కువయ్యాయి అంటూ సిగ్గు పడుతుంది. హోలీ ఈవెంట్ ప్రోమోలో వీరిద్దరినీ హైలెట్ చేస్తూ స్టార్ మా ఈ వీడియోను రిలీజ్ చేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ ప్రోమో లక్షల్లో వ్యూస్ తెచ్చుకుంటోంది. మరి ఈ టీవీలో ఎవర్ గ్రీన్ గా వెలుగొందిన ఈ జంట.. స్టార్ మా ఛానల్ లో ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి. ఇక హోలీ పండుగ నాడు ఈ ఈవెంట్ ఎపిసోడ్ రిలీజ్ కానుంది.

    Also Read: రాఖీ కట్టిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న శ్రీదేవి.. స్టార్ హీరో మోసం వల్లేనా?

    Tags