https://oktelugu.com/

Samantha Treatment : సమంతకు క్రయోథెరపీ, ఆందోళనలో ఫ్యాన్స్… సడన్ గా ఈ ట్రీట్మెంట్ ఎందుకంటే?

కొన్నాళ్ళు ఇంటికే పరిమితమైన సమంత ఓ ఆరు నెలల తర్వాత షూటింగ్స్ లో పాల్గొన్నారు. సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన సమంత... విరామం తీసుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2023 / 07:29 PM IST
    Follow us on

    Samantha Treatment : సమంత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2022 అక్టోబర్ లో సమంత మయోసైటిస్ సోకిన విషయం వెల్లడించింది. సమంత ప్రకటనతో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. యశోద చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత తన అనారోగ్య పరిస్థితిపై స్పష్టత ఇచ్చారు. మయోసైటిస్ ప్రాణాంతకం కాదు. అదే సమయంలో చిన్న సమస్య కూడా కాదు. నేను సుదీర్ఘ కాలం పోరాటం చేయాల్సి ఉంది. నేను ఈ మహమ్మారిని ఎదిరించి నిలబడగలనని నమ్మకం ఉందన్నారు.

    కొన్నాళ్ళు ఇంటికే పరిమితమైన సమంత ఓ ఆరు నెలల తర్వాత షూటింగ్స్ లో పాల్గొన్నారు. సిటాడెల్, ఖుషి ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన సమంత… విరామం తీసుకున్నారు. సమంత కొత్త ప్రాజెక్ట్స్ కి ప్రకటించలేదు. ఇష్టమైన ప్రదేశాల్లో విహరిస్తూ సేద తీరుతుంది. మరోవైపు ఆమెకు ట్రీట్మెంట్ కూడా జరుగుతుందని సమాచారం. ఇటీవల ఆమె క్రయోథెరపీ తీసుకుందట.

    ఏమిటీ క్రయోథెరపీ అని ఆరా తీయగా… గడ్డ కట్టించే చల్లని నీళ్ల టబ్ లో గొంతు వరకు మునిగి కొన్ని నిమిషాల పాటు ఉండాలి. శరీరాన్ని అత్యంత చల్లదనానికి గురి చేస్తారట. క్రయోథెరపీ వలన శరీరంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట. రక్త ప్రసరణ మెరుగవుతుందట. అన్నింటికీ మించి శరీరంలో ఉన్న అనారోగ్యకర, అవసరం లేని కణజాలాన్ని నాశనం చేస్తుందట. కండరాల వాపు, నొప్పి వంటి సమస్యలు తగ్గిస్తుందట.

    మయోసైటిస్ కారణంగా కండరాల వాపు, నొప్పి, అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటికి క్రయోథెరపీ మంచి ట్రీట్మెంట్ అట. అందుకే సమంత క్రయోథెరపీ చేయించుకుంటున్నారట. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. కాగా 2023లో సమంత శాకుంతలం, ఖుషి చిత్రాలు విడుదల చేసింది. శాకుంతలం డిజాస్టర్ అయ్యింది. విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఖుషి ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది…