Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu contestants list: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' షో నుండి...

Bigg Boss 10 Telugu contestants list: ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో నుండి ‘బిగ్ బాస్ 10’ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే..

Bigg Boss 10 Telugu contestants list: ప్రతీ ఏడాది ప్రసమారయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కి కోసం కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రకరకాల ఎమోషన్స్ తో ఒక రోలర్ కోస్టర్ లాగా సాగిపోయే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పటి వరకు 9 సీజన్స్ ని పూర్తి చేసుకుంది. 9 వ సీజన్ కి ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ సెన్సేషనల్ అనే చెప్పాలి. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ పండించిన ఎమోషన్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే గత సీజన్ ని నెత్తిన పెట్టుకొని మరీ ఆదరించారు. ఆలాంటి సెన్సేషనల్ సీజన్ తర్వాత , పదవ సీజన్ పై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో పెరగలేదు.

ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వేట రెండు నెలల క్రితమే మొదలైంది. గత సీజన్ లాగానే ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష’ అనే షోని నిర్వహించి దాని , ఆ షో ద్వారా కొంతమంది సామాన్యులను కంటెస్టెంట్స్ గా లోపలకు పంపబోతున్నారు. గత సీజన్ లో టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఇద్దరు సామాన్యులు ఉండడం , విన్నర్ గా కూడా సామాన్యుడే నిలవడంతో, ఆడియన్స్ ఈ ‘అగ్నిపరీక్ష 2’ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అది కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ అనే షో విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో నుండి కొంతమంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 10 లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వారిలో నూకరాజు అనే కంటెస్టెంట్ నూటికి నూరు శాతం ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది.

ఇతను జబర్దస్త్ షో ద్వారా పాపులర్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో ద్వారా ఇప్పటి వరకు పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఇతని నుండి రాలేదు కానీ, ఎమోషన్స్ మాత్రం గట్టిగానే పలికిస్తున్నాడు. అదే విధంగా ఈ షో నుండి భాను , సోనియా, మహేష్ మరియు శివ్ వంటి వారిలో ఇద్దరు హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. వీళ్ళందరూ ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షోలో మంచి కంటెంట్ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళే బిగ్ బాస్ రియాలిటీ షోకి కావాలి కాబట్టి , కచ్చితంగా వీరిలో ఇద్దరినీ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా రీసెంట్ గా మొదలైన ‘కూకూ విత్ జాతి రత్నాలు 2’ షో నుండి శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఒక కంటెస్టెంట్ గా ‘బిగ్ బాస్ 10’ లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం . ఈయన సినిమాల్లో పాపులర్ నటుడు అనే విషయం అందరికీ తెలిసిందే. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎవరెవరు రాబోతున్నారు అనేది.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular