Telugu Channels
Telugu Channels : యూట్యూబ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌ను కోట్లాది మంది వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో క్షణానికి ఒక్కో యూట్యూబర్ అన్నట్టుగా ప్రతి క్షణానికి ఎన్నో కొత్త యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఇక కొత్త వీడియోలు కూడా అప్‌లోడ్ చేస్తున్నారు. ఇక యూట్యూబ్ ద్వారా రూ. లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్న వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా యూట్యూబ్ అంటే అందరికీ గుర్తొచ్చేది సబ్‌స్క్రైబర్స్. ఎంత ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటే అంత ఎక్కువ ఆదాయం వస్తుంది. అయితే ఒక కోటి మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటేనే వామ్మో అనుకుంటాం. మరి తెలుగులో అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ఏంటో మీకు తెలుసా.? అలాంటి వారు మన తెలుగు వారు ఎవరో ఓ సారి చూసేద్దాం.
హర్ష సాయి: హర్ష సాయి గురించి తెలుగు వారికి పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న చానల్స్ లో ఈయన పేరు ముందు ఉంది. ఈయనకు ఏకంగా యూట్యూబ్ లో 10.9 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. పేదవారి ఇంటికి వెళ్లి వారికి చిన్న టాస్క్ లు ఇచ్చి మీరు గెలుచుకున్నారు అంటూ పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తూ తెగ వైరల్ అయ్యారు హర్ష సాయి. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ వివాదంలో కూడా ఇరుక్కున్నారు. ఈయనకు ఉన్న అభిమానుల్లో కొందరు నెగటివ్ గా మారడానికి కారణం కూడా ఈ ప్రమోషన్స్ అంటున్నారు విశ్లేషకులు.
ఫిల్మోజీ: ఇక ఈ ఛానెల్ గురించి కూడా పరిచయం అవసరం లేదు. ఫేస్ లు కనిపించకుండా వీరు మాట్లాడే మాటలు అదరహో అనిపిస్తాయి. ఓ రేంజ్ లో ఫన్నీ ఉంటుంది బ్రో. మావ మావ అంటూ మనుసులు గెలిచేశారు ఈ ఛానెల్ వారు. ఇక వీరికి ఏకంగా 5.3 మిలిన్ల సబ్ స్కైబర్లు ఉన్నారు.
షణ్ముఖ్ జస్వంత్: సాఫ్ట్ వేర్ షార్ట్ ఫిలిం తో ఫుల్ ఫేమస్ అయ్యారు ఈ యూట్యూబర్. నెగిటివ్, పాజిటివ్ టాక్ తో దూసుకొని పోయే ఈ స్టార్ నటుడి షార్ట్ ఫిలిం కి మాత్రం ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు. షణ్ముఖ్, వైష్ణవి చైతన్య కలిసి నటించిన సాప్ట్ వేర్ డెవలపర్ సూపర్ సక్సెస్ ను సాధించింది. ఈయన ఏకంగా 4.93 మిలియన్ల సబ్ స్కైబర్లతో మూడవ స్థానంలో ఉన్నారు.
ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు: ఈ ఛానెల్ కు ఏకంగా 4.73 మిలియన్ల స్కైబర్లు ఉన్నారు. ఈయన మాటలకు పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు. ఈయన వీడియోల కోసం ఎదురుచూసేవారు కూడా ఎక్కువే.
శ్రావణి కిచెన్: ఎలాంటి వంటలు అయినా సరే నేర్చుకోవాలి అంటే ఈ ఛానెల్ ను ఫాలో అవచ్చు. లెమన్ రైస్ దగ్గర నుంచి పిండి వంటల వరకు ప్రతి ఒక్క వీడియో చేస్తూ చాలా ఫేమస్ అయింది ఈ ఛానెల్. శ్రావణి కిచెన్ ఛానెల్ తో వంట చేస్తూ కూడా అభిమానులను సంపాదించవచ్చని, డబ్బులు సంపాదించవచ్చని నిరూపించారు. ఈ ఛానెల్ కు ఏకంగా 4.7 మిలియన్ల సబ్ స్కైబర్స్ ఉన్నారు.
ఇక ఈ ఛానెల్లు మాత్రమే కాదు బ్యాంకాక్ పిల్లా 3.61 మిలియన్లు, అమ్మచేతి వంట 3.52 మిలియన్లు, మై విలేజ్ షో 3.1 మిలియన్లు, రుహాన్ అర్హద్ అఫీషియల్ 2.88 మిలియన్ల సబ్ స్క్రైబర్లతో టాప్ 10లో ఉన్నారు.