Best Actors: చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ.. కొంతమంది మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటారు. వారు మెచ్చే సినిమాల నటిస్తూ ఆకట్టుకుంటారు. సినిమా అనేది పూర్తి వాణిజ్య వస్తువుగా మారిపోయిన నేటి రోజుల్లో.. కొంతమంది మాత్రం తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నారు. అలా ఈ 21 శతాబ్దపు ఉత్తమ నటుల జాబితాను ఇంగ్లాండ్ కు చెందిన ది ఇండిపెండెంట్ పత్రిక వెల్లడించింది. అయితే ఇందులో అనేకమంది లబ్ద ప్రతిష్టులైన నటులు ఉన్నారు. వారిలో భారత్ నుంచి ఇర్ఫాన్ ఖాన్ మాత్రమే అవకాశం దక్కించుకున్నారు. ఈయన 1988లో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అంతకు పైగా సినిమాల్లో నటించారు. ఈయన నటించిన పాన్ సింగ్ తోమర్ అనే సినిమాకు జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఉత్తమ నటుడి అవార్డును పొందాడు. ఇక అనేక సినిమాల్లో నటించినందుకుగాను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను సాధించాడు. అయితే మెదడులో ఏర్పడిన కణితి క్యాన్సర్ కు కారణమైంది. అంతిమంగా ఇర్ఫాన్ ఖాన్ 2020లో చనిపోయారు. ది ఇండిపెండెంట్ పత్రిక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 60 మంది ఉత్తమ యాక్టర్ల జాబితాలో ఇర్ఫాన్ ఖాన్ కు 41 ర్యాంక్ కేటాయించింది.
విలక్షణ నటుడు
1988లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తను చనిపోయిన వాటికి ఇర్ఫాన్ ఖాన్ కేవలం వందకు పైగానే సినిమాల్లో నటించారంటే.. ఆయనకు నటన మీద ఏ స్థాయిలో ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగులోనూ సైనికుడు అనే సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. ఆ సినిమా కథనాయకుడు మహేష్ బాబును మించి నటించారు. ఇక బాలీవుడ్ లో అయితే లెక్కకు మిక్కిలి సినిమాల్లో ఆయన నటించారు. చాలావరకు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. అందువల్లే ఆయనను బాలీవుడ్ లో వెర్సటైల్ యాక్టర్ అని పిలుస్తారు. ఈయన పాన్ సింగ్ తోమర్ అనే సినిమాలో నట విశ్వరూపం చూపించారు. లైఫ్ ఆఫ్ పై, తల్వార్, సలాం బాంబే వంటి సినిమాల్లో నటించినందుకు గాను ఇర్ఫాన్ ఖాన్ కు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇర్ఫాన్ ఖాన్ కు 2018 లోనే మెదడులో ట్యూమర్ బయటపడింది. ఆ తర్వాత అతడు అమెరికాలో చికిత్స తీసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి అతడు 2020లో కన్నుమూశాడు. ఇర్ఫాన్ ఖాన్ చనిపోయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ది ఇండిపెండెంట్ పత్రిక అతడిని ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నటుల జాబితాలో చేర్చడం.. అతడి నటనను కీర్తించడం నిజంగా భారతీయులకు గర్వకారణం.