https://oktelugu.com/

CM Chandrababu: దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు.. ఇంతకీ ఆయన ఆస్తుల విలువ ఎంతో తెలుసా..

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత.. మహారాష్ట్ర, హర్యానా, జమ్ము కాశ్మీ, జార్ఖండ్ ఫలితాలు వచ్చిన తర్వాత.. అసోసియేట్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ అనే సంస్థ అనేక వడపోతల తర్వాత దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించింది..

Written By:
  • Dharma
  • , Updated On : December 31, 2024 / 08:32 AM IST

    CM Chandrababu(10)

    Follow us on

    CM Chandrababu: అసోసియేట్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. అత్యధిక సంపాదన కలిగిన ముఖ్యమంత్రులలో చంద్రబాబు ప్రథమ స్థానంలో ఉన్నారు. ఏడీఆర్ వెల్లడించిన నివేదిక ప్రకారం చంద్రబాబు ఆస్తుల విలువ దాదాపు ₹931 కోట్లుగా తేలింది. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో అత్యధికంగా ఆస్తులు కలిగి ఉన్న సీఎంగా చంద్రబాబు ప్రధమ స్థానంలో ఉండడం విశేషం. చంద్రబాబు చరాస్తుల విలువ 810 కోట్లు. స్థిరాస్తుల విలువ 121 కోట్లు. జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఆస్తుల విలువ 332 కోట్లతో రెండవ స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 51 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు.. కేరళ ముఖ్యమంత్రి విజయన్ కోటి, జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా 55 లక్షల విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. అత్యంత బీద ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అని తేలింది. ఆమె ఆస్తులు కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమేనట. అసోసియేట్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ ఈ వివరాలను వెల్లడించింది.

    జాతీయ రాజకీయాలలో కీలకం

    గతంలో వాజ్ పేయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్నారు. నాడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన కేంద్రంలో చక్రం తిప్పారు.. మళ్లీ ఇన్నాళ్లకు చంద్రబాబుకు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం లభించింది. ప్రస్తుతం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు. చంద్రబాబు తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా కొనసాగుతున్నారు. అందువల్లే ఇటీవల కేంద్రం బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. వరల్డ్ బ్యాంకు సహాయంతో ఈ నగదును దశలవారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వనుంది. దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. రాజమండ్రి జైలులో ఆయన చాలా రోజులపాటు గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంయుక్తంగా పోటీ చేశారు. ఇందులో బిజెపి కూడా ఉంది. మొత్తంగా 2024 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 164 సీట్లు గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.. ప్రస్తుతం పరిపాలన విషయంలోనూ అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన పథకాలను దశలవారీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.