Star Heroes: డిజాస్టర్ ను ఎదుర్కొని కం బ్యాక్ వచ్చిన 8 మంది స్టార్ హీరోలు వీళ్లే..

బాలీవుడ్ బాద్ షా గా పేరొందిన షారుఖ్ ఖాన్ దశాబ్దాలుగా ఫ్యాన్స్ ను తన సినిమాలతో అలరిస్తున్నాడు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.

Written By: Chai Muchhata, Updated On : September 11, 2023 12:15 pm

Star Heroes

Follow us on

Star Heroes: సినిమా జీవితం పైకి చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది.ఈ రంగంలో ఉన్న వారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని చాలా మంది అనుకుంటారు. కానీ ఏ రంగంలో వారికైనా కష్టాలు తప్పవు. కష్డపనిదే ఏదీ రాదు. ఉద్యోగం చేసేవారికి నెలనెలా జీతం వస్తుంది. కానీ ఈ రంగంలోని వారికి సినిమా ప్రారంభమైతేనే ఆదాయం వస్తుంది. అయితే వారు నటించిన సినిమా హిట్టు కొడితేనే నెక్స్ట్ మూవీల్లో అవకాశం వస్తుంది. స్టార్ హీరోలు అయినా వరుస ప్లాపులు వస్తే రేటింగ్ పడిపోతుంది. అయితే అలా ఒకటి, రెండు సినిమాలు ప్లాప్ అయినా ఆ తరువాత సినిమా హిట్టు కొడితే వారి రేంజ్ మారిపోతుంది. ఇటువంటి పరిస్థితి కొందరు స్టార్ హీరోలు ఎదుర్కొన్నారు. వారెవరంటే?

చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా, ఆచార్య లు వరుస ప్లాపులు ఇచ్చాయి. కానీ ఆ తరువాత ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ హిట్టు ఇచ్చింది. దీంతో మెగాస్టార్ మళ్లీ ఫాంలోకి వచ్చారని చెప్పవచ్చు. రవితేజ కూడా నటించిన ఈ మూవీ మంచి వసూళ్లను సాధించింది.

నాని:
‘శ్యామ్ సింగరాయ్’ మూవీ తరువాత నాని చేసిన ‘అంటే సుందరానికి’ అనుకున్న విజయం సాధించలేదు. అయితే ఆ తరువాత నటించిన ‘దసరా’ బ్లాక్ బస్టర్ కొట్టాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది.

షారుఖ్ ఖాన్:
బాలీవుడ్ బాద్ షా గా పేరొందిన షారుఖ్ ఖాన్ దశాబ్దాలుగా ఫ్యాన్స్ ను తన సినిమాలతో అలరిస్తున్నాడు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. అయితే గత ఐదేళ్లుగా షారుఖ్ ఖాన్ కు హిట్టు సినిమాలు లేవు. వరుసగా ప్లాపులు వచ్చాయి. ఈ ఏడాది ‘పఠాన్’, ‘జవాన్’లతో కమ్ బ్యాక్ వచ్చాడు.

ధనుష్:
సౌత్ స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ ఆ మధ్య వరుస ప్లాపులు ఎదురయ్యాయి.2021లో ‘కర్ణన్’ అనే మూవీ భారీ డిజాస్టర్ ను మిగిల్చింది. అయితే ఈ ఏడాదిలో తిరు, సర్ సినిమాలతో అలరించారు. కానీ సర్ సినిమా అన్ని భాషల్లో బిగ్ హిట్టుగా నిలిచి మళ్లీ ఫాంలోకి వచ్చాడు.

విజయ్:
ఇళయ దళపతి గా పేరున్న విజయ్ కి ‘బీస్ట్’ మూవీ నిరాశపరిచింది. ఈ మూవీ తరువాత రష్మిక మందానాతో కలిసి ‘వారసుడు’ అనే సినిమాలో నటించాడు. దీనిని తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేయడంతో రెండు చోట్లు హిట్ టాక్ తెచ్చుకుంది.

నరేష్:
కామెడీ చిత్రాలతో పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఇప్పుడు యాక్షన్ మూవీస్ లో నటిస్తున్నాడు. అయితే కొన్ని సినిమాలు నిరాశపరిచినా ‘నాంది’ మంచిపేరు తీసుకొచ్చింది.

సాయిధరమ్ తేజ్:
‘రిపబ్లిక్’ మూవీ తరువాత హిట్టు కోసం ఎదురుచూస్తున్న సాయి ధరమ్ తేజ్ కు ‘విరూపాక్ష’ మించి సక్సెస్ ను అందించింది. దీంతో సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్ అయ్యాడు.

కిరణ్ అబ్బవరం:
ఎస్ ఆర్ కల్యాణ మండపం తరువాత ఈ హీరోకు సరైన హిట్టు రాలేదు. కానీ ఈ ఏడాదిలో వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మంచి పేరు తీసుకొచ్చింది.