Homeబిజినెస్Mahindra Cars: రూ.1.25 లక్షల డిస్కౌంట్ ప్రకటించిన కార్ల కంపెనీ..

Mahindra Cars: రూ.1.25 లక్షల డిస్కౌంట్ ప్రకటించిన కార్ల కంపెనీ..

Mahindra Cars: కొత్త వస్తువును పండుగ సందర్భంగా కొనుగోలు చేయాలనుకుంటారు చాలా మంది. వినియోగదారులను సైతం ఆకర్షించే విధంగా పండుగల సందర్భంగా కొన్ని కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఆటోమోబైల్ రంగం కూడా ప్రత్యేక రోజుల్లో భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తుంది. ప్రస్తుతం పండుగల సీజన్ ప్రారంభం కానుండటంతో కార్ల కంపెనీలో వరుసగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకీ రూ.50 వేలకు పైగా క్యాష్ బ్యాక్ ఇస్తూ ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా సైతం కార్ల డిస్కౌంట్ పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఏకంగా రూ. లక్ష రూపాయలకు పైగానే క్యాష్ బ్యాక్ ఇస్తానని తెలుపుతోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే..

మహీంద్రా కంపెనీ ఎస్ యూవీలను రోడ్లపై తిప్పుతూ ఆకర్షిస్తోంది. ఈ కంపెనీకి చెందిన ఎక్స్ యూవీ పై ఏకంగా రూ.1.25 లక్షల డిస్కౌంట్ ఇస్తోంది. 2022 లో వరల్డ్ ఈవీ డే సందర్భంగా దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన మొట్టమొదటి విద్యుత్ వాహనం ఇది. 39.4 kwh బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 375 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ ఐ ఆర్వీఎం, ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

మార్కెట్లో టాటా నెక్సాన్ కు పోటీగా రిలీజ్ అయిన ఈ మోడల్ బెస్ట్ సెల్లింగ్ గా కొనసాగుతోంది. దీని ఎక్స్ షో రూం ధర రూ.15.99 లక్షల నుంచి రూ.18.99 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇందులో టాప్ ఎండ్ మోడల్ ఈఎల్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా వివిధ కలర్స్ లో లభ్యమవుతున్నాయి. ఈ మోడల్ కు వినియోగదారుల ఆదరణ ఉన్నా తాజాగా పండుగల సీజన్ నేపథ్యంలో కంపెనీ భారీ డిస్కౌంట్లు పెంచి మరింత ఇంప్రెస్ చేస్తోంది. మహీంద్రా ఎక్స్ యూవీ పై ఏకంగా రూ.1.25 లక్షల డిస్కౌంట్ ఇస్తోంది.

ఇదే కాకుండా మరాజ్ పై రూ.58 వేల క్యాష్ డిస్కౌంట్ః,రూ.15 వేల ప్రీ యాక్ససరీస్ వంటివి ఇస్తోంది. ఇదే కంపెనీకి చెందిన బొలెరో నియోపై రూ.7 వేల నుంచి రూ. 35 వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 15 ల యాక్ససరీస్ ను ఇస్తోంది. బొలెరో ఎస్ యూవీ పై రూ.25 వేల నుంచి రూ.60 వేలు తగ్గింపు చేస్తోంది. మహీంద్రా ఎక్స్ యూవీ 300 పైగా ఆఫర్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన పెట్రోల్ వేరియంట్ పై రూ.4,500 నుంచి రూ.71 వేల వరకు .. డీజిల్ మోడల్ పై రూ. 71 వేల వరకు డిస్కౌంట్లు ఇస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version