OTT Movies
OTT Movies: వీకెండ్ వస్తే థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసే ఆడియన్స్ ఎంత మంది అయితే ఉంటారో, ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం ఎదురు చూసే ఆడియన్స్ కూడా అంతే ఉంటారు. గత వారం ఓటీటీ లో ‘డాకు మహారాజ్'(Daaku Maharaj Movie) చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ వారం ఏకంగా ఆరు కొత్త సినిమాలు ఓటీటీ లో సందడి చేయబోతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
1) సంక్రాంతికి వస్తున్నాం:
విక్టరీ వెంకటేష్(victory venkatesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరో హీరోయిన్లు గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ వసూళ్లను రాబట్టిందో మనమంతా చూసాము. సుమారుగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మార్చి 1వ తేదీన జీ5 యాప్ లో అందుబాటులోకి రానుంది. అదే రోజున ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ కూడా అవ్వబోతుందట. ఇలా ఒకే రోజున ఓటీటీ/ టీవీ టెలికాస్ట్ లో ప్రసారం అవ్వబోతున్న మొట్టమొదటి సినిమా ఇదే. ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
2) ఆశ్రమ్ 3 :
‘యానిమల్’, ‘డాకు మహారాజ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన నటుడు బాబీ డియోల్(Bobby Deol). ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో, ఇప్పుడు విలన్ గా దేశవ్యాప్తంగా వరుస అవకాశాలను సంపాదిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈయన కథానాయకుడిగా నటించిన ఆశ్రమ్ అనే వెబ్ సిరీస్ రెండు సీజన్స్ ని పూర్తి చేసుకుంది. ఈ రెండు సీజన్స్ కి కూడా ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడవ సీజన్ ఈ నెల 27 వ తారీఖున అమెజాన్ ప్రైమ్, MX ప్లేయర్ ఓటీటీ యాప్స్ లో అందుబాటులోకి రానుంది.
3) బీటిల్ జ్యూస్ :
గత ఏడాది విడుదలైన ఈ ఇంగ్లీష్ కామెడీ హారర్ చిత్రం హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా డిస్నీ + హాట్ స్టార్ లో ఈ నెల 28 వ తారీఖు నుండి అందుబాటులోకి రానుంది.
4) విడాముయార్చి/ పట్టుదల:
తమిళ సూపర్ స్టార్ తల అజిత్(Thala Ajith) హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు కానీ, ఓటీటీ ఆడియన్స్ కి మాత్రం కచ్చితంగా నచ్చుతుంది. మార్చి 3 నుండి ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
5) ది వాస్ప్:
గత ఏడాది విడుదలైన ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పర్లేదు అనే రేంజ్ లో రెస్పాన్స్ ని దక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్ లో హారర్ జానర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి, ఈ వారం ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 28 నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.