https://oktelugu.com/

Tamanna : తమన్నా ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో భార్య..మా ఆయన పక్కన కనిపిస్తే తోలు తీస్తా అంటూ బెదిరింపులు!

Tamanna : సౌత్ ఇండియా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే కచ్చితంగా తమన్నా(Tamanna Bhatia) పేరు అందులో వినిపిస్తుంది.

Written By: , Updated On : February 25, 2025 / 08:49 AM IST
Tamanna

Tamanna

Follow us on

Tamanna : సౌత్ ఇండియా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే కచ్చితంగా తమన్నా(Tamanna Bhatia) పేరు అందులో వినిపిస్తుంది. ఏడాది తిరిగేసరికి ఎంతో మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ లో పుట్టుకొని రావొచ్చు, వాళ్ళు వరుస సూపర్ హిట్స్ ని అందుకొని స్టార్ హీరోయిన్స్ కూడా అవ్వొచ్చు, కానీ తమన్నా స్థానాన్ని మాత్రం రీప్లేస్ చేయలేకపోయారు. పాలరాతి శిల్పం లాంటి అందం, అద్భుతమైన నటన, నెమలి లాంటి నాట్యం, ఇవన్నీ కలగలిపితే తమన్నా. ఇలాంటి టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ఇండస్ట్రీ లో దొరకడం చాలా కష్టం. తమన్నా కి వయస్సు పెరిగిన తర్వాత అందం తరిగిపోవచ్చు, కానీ ఆమెలో ఉన్న టాలెంట్ కారణంగా చివరి శ్వాస వరకు సినిమాలు చేయగల కెపాసిటీ ఆమెకు ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆమె ఇండియా లో టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతుందంటే సాధారణమైన విషయం కాదు.

ఇదంతా పక్కన పెడితే అందరి హీరోయిన్స్ పైన వచ్చే రూమర్స్ లాగానే, తమన్నా పై కూడా అప్పట్లో రూమర్స్ చాలా గట్టిగా వినిపించేవి. ప్రముఖ తమిళ హీరో సూర్య(Suriya Siva Kumar) సోదరుడు కార్తీ(Karthi Sivakumar) తో ఈమె అప్పట్లో ప్రేమాయణం నడిపినట్టు ఒక రేంజ్ లో వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరు కలిసి చిరుతై, ఆవారా, ఊపిరి వంటి సినిమాల్లో నటించారు. ఈ మూడు సినిమాలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. ఒక హీరో, హీరోయిన్ కలిసి రిపీట్ గా సినిమాలు చేస్తే, కచ్చితంగా ఇలాంటి రూమర్స్ పుట్టుకొస్తాయి, అది సర్వసాధారణమే. కానీ ఈ రూమర్ వచ్చినప్పుడు కార్తీ కి పెళ్లి కూడా అయిపోయి ఉంది. అయినప్పటికీ ఈ రూమర్ అప్పట్లో కోలీవుడ్ లో సంచలనం రేపింది. వీళ్లిద్దరి వ్యవహారాన్ని తెలుసుకున్న కార్తీ భార్య, నేరుగా తమన్నా ఇంటికి వెళ్లి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఈ రూమర్స్ పై రీసెంట్ గా కార్తీ ఒక ఇంటర్వ్యూ లో స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ ‘అవన్నీ గాలి వార్తలే అండీ. కానీ నేను ఈ రూమర్స్ ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఎలాగో నిజ జీవితం లో జరగదు, కనీసం ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఎంజాయ్ అయినా చేస్తే సంతృప్తి గా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా తమన్నా చాలా కాలం నుండి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో క్లారిటీ లేదు కానీ, లివింగ్ రిలేషన్ షిప్ లో మాత్రం కొనసాగుతున్నారు. మరోపక్క తమన్నా వరుస సినిమాలతో బిజీ గా ఉంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓదెల 2’ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.