OOT : 2024 ఫస్ట్ హాఫ్ ఓటీటీ రిపోర్ట్… ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చిన 10 సిరీస్లు ఇవే! మీరు చూశారా?

ఈ ఫ్లాట్ ఫార్మ్ సబ్స్క్రిప్షన్ ఉంటే... దాదాపు విడుదలైన చిత్రాలన్నీ ఓ నెల రోజుల తర్వాత ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయవచ్చు. కాగా సినిమా కంటే సిరీస్లు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. సిరీస్లు థియేటర్స్ లోకి రావు. ఖచ్చితంగా సదరు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో చూడాల్సిందే. ఒక సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ చూసేందుకైనా నెల లేదా మూడు నెలల సబ్స్క్రిప్షన్ ఆడియన్స్ తీసుకుంటున్నారు.

Written By: S Reddy, Updated On : July 21, 2024 5:36 pm
Follow us on

OOT : ఇండియన్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్ ని ఓటీటీ కొల్లగొడుతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు, సిరీస్లు చూసే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. 2024 లెక్కల ప్రకారం ఓటీటీ $ 460 మిలియన్ మార్కెట్ సైజు కలిగి ఉంది. అంటే రూ. 385 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుంది. మిడిల్ క్లాస్ నుండి ఆపై ఆదాయవర్గాలు కనీసం మూడు నాలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ సబ్స్క్రిప్షన్ కలిగి ఉంటున్నారు. హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ 5, సోనీ లివ్ ఫ్లాట్ ఫార్మ్స్ మెజారిటీ తెలుగు చిత్రాలు అందిస్తున్నాయి.

ఈ ఫ్లాట్ ఫార్మ్ సబ్స్క్రిప్షన్ ఉంటే… దాదాపు విడుదలైన చిత్రాలన్నీ ఓ నెల రోజుల తర్వాత ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయవచ్చు. కాగా సినిమా కంటే సిరీస్లు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. సిరీస్లు థియేటర్స్ లోకి రావు. ఖచ్చితంగా సదరు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో చూడాల్సిందే. ఒక సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ చూసేందుకైనా నెల లేదా మూడు నెలల సబ్స్క్రిప్షన్ ఆడియన్స్ తీసుకుంటున్నారు.

ప్రతి ఏడాది వందల సంఖ్యలో డిజిటల్ సిరీస్లు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో అత్యంత ఆదరణ పొందిన సిరీస్లు ఏమిటో చూద్దాం. ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ 2024లో విడుదలైన వెబ్ సిరీస్ల మీద అధ్యయనం చేసింది. అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించిన వెబ్ సిరీస్ల లిస్ట్ విడుదల చేసింది. మరి టాప్ 15 సిరీస్ల వివరాలు ఇలా ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన పంచాయత్ సీజన్ 3 ప్రథమ స్థానంలో ఉంది. ఈ సిరీస్ ని ఏకంగా 2.82 కోట్ల మంది ఆడియన్స్ చూశారు. పంచాయత్ కామెడీ డ్రామా. 2020లో మొదటి సీజన్ విడుదలైంది. విపరీతమైన ఆదరణ రావడంతో మూడవ సీజన్ విడుదల చేశారు. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్ర చేయగా.. దీపక్ కుమార్ మిశ్ర దర్శకత్వం వహించాడు.

హీరామండి మరొక సక్సెస్ఫుల్ సిరీస్ గా ఉంది. హీరామండి సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. 2.30 కోట్ల మంది ఇప్పటి వరకు వీక్షించారు. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఈ సిరీస్ తెరకెక్కించడం విశేషం. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి ప్రధాన పాత్రలు చేశారు.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న యాక్షన్ థ్రిల్లర్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలు చేశారు. రోహిత్ శెట్టి దర్శకుడు. ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్ ని 1.95 కోట్ల ప్రేక్షకులు చూశారు.

కోట ఫ్యాక్టరీ సీజన్ 3 టాప్ ఫైవ్ వెబ్ సిరీస్లలో చోటు దక్కించుకుంది. కోట ఫ్యాక్టరీ డ్రామా కాగా ప్రతీష్ మెహత దర్శకత్వం వహించాడు. కోట ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ ని ఇప్పటి వరకు 1.57 కోట్ల మంది చూశారు. కోట ఫ్యాక్టరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్స్ 3&4 సైతం విశేష ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్. ఈ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సిరీస్ ని 1.48 కోట్ల మంది చూశారు.

2024కి గానూ(ఇప్పటి వరకు విడుదలైనవి)టాప్ టెన్ వెబ్ సిరీస్ల లిస్ట్

1.పంచాయత్ సీజన్ 3(అమెజాన్ ప్రైమ్)
2. హీరామండి (నెట్ఫ్లిక్స్)
3.ఇండియన్ పోలీస్ ఫోర్స్(అమెజాన్ ప్రైమ్)
4. ది కోట ఫ్యాక్టరీ సీజన్ 3(నెట్ఫ్లిక్స్)
5. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3&4(హాట్ స్టార్)
6. షో టైం (హాట్ స్టార్)
7. గుల్లక్ సీజన్ 4(సోనీ లివ్)
8. మహారాణి సీజన్ 3(సోనీ లివ్)
9. కిల్లర్ సూప్ (నెట్ఫ్లిక్స్)
10. జంనపార్ (అమెజాన్ మినీ టీవీ)