Rajamouli: మొదటి ఆట నుండే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్స్ గా నిల్చిన రాజమౌళి సినిమాలు ఇవే!

రాజమౌళి సాహసం చేసి 45 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో 'మగధీర' చిత్రాన్ని తీసాడు. అప్పటి ఇండస్ట్రీ పోకిరి 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. కానీ ఆరోజుల్లోనే పోకిరి కి వచ్చిన కలెక్షన్స్ కంటే 11 కోట్ల రూపాయిల అదనపు బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Written By: Vicky, Updated On : August 23, 2024 7:22 pm

Rajamouli

Follow us on

Rajamouli: ఒక టీవీ సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన రాజమౌళి నేడు పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ఎదిగిన తీరు ప్రతీ ఒక్కరికీ ఆదర్శమే. కెరీర్ లో ఇప్పటి రాజమౌళి కి ఫ్లాప్ అంటే ఏంటో తెలియదు. కానీ ఆయన తెరకెక్కించిన కొన్ని సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చాయి అనే విషయం మాత్రం మనతోపాటు రాజమౌళికి కూడా తెలుసు. ఆ టాక్ ని చూసి రాజమౌళి ఏడుస్తూ, రాత్రి నిద్రపోని సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు మరేమిటో కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమ తలరాతని మార్చేసిన ‘మగధీర’, ‘బాహుబలి’ చిత్రాలు. ఈ సినిమాలకు ఫ్లాప్ టాక్ రావడం ఏంటి అని తెలియని వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు. కానీ అది పచ్చి నిజం, ఈ రెండు సినిమాలకు డిజాస్టర్ టాక్స్ వచ్చాయి. ఆరోజుల్లో మన తెలుగు సినిమా మార్కెట్ కేవలం 30 కోట్ల రూపాయిల వరకే ఉంటుంది.

కానీ రాజమౌళి సాహసం చేసి 45 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ‘మగధీర’ చిత్రాన్ని తీసాడు. అప్పటి ఇండస్ట్రీ పోకిరి 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. కానీ ఆరోజుల్లోనే పోకిరి కి వచ్చిన కలెక్షన్స్ కంటే 11 కోట్ల రూపాయిల అదనపు బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలా ఆరోజు మితిమీరిన అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ విషయాన్నీ తెలుసుకున్న రాజమౌళి తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి అయ్యాడట. ఇన్ని కోట్లు ఖర్చు చేయించి సినిమా తీసాను, ఇప్పుడు ఫ్లాప్ టాక్ వచ్చింది , అల్లు అరవింద్ కి ఏమని సమాధానం చెప్పాలి అని భయపడ్డాడట. ఇంతలోపే అల్లు అరవింద్ ఫోన్ చేసాడట, భయం తో ఫోన్ ని ఎత్తుకున్న రాజమౌళి కి అవతల వైపు అల్లు అరవింద్ అనడం తో సినిమా హిట్ కొట్టేసాం అనడంతో రాజమౌళి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి సునామీ ని సృష్టించిందో మనమంతా చూసాము. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న రెండవ చిత్రం బాహుబలి.

ఈ విషయాన్నీ స్వయంగా రాజమౌళి, ప్రభాస్ తెలిపాడు. బాలీవుడ్ లో ఈ చిత్రానికి మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చిందని, కానీ తెలుగు ఆడియన్స్ ప్రారంభంలో ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ చెప్పారని, ఆ టాక్ ని చూసి నాకు గుండెలు ఆగినంత పని అయ్యింది అంటూ రాజమౌళి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అలా ఏ సినిమాలకు అయితే ఫ్లాప్ టాక్స్ వచ్చాయో, ఆ సినిమాలే నేడు టాలీవుడ్ భవిష్యత్తుని మార్చేశాయి. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఈ సెట్స్ మీదకు వెళ్లనుంది.