Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెక్కల మొత్తం మారిపోయాయి. ఒకప్పుడు కంటెంట్ బావుంటేనే సినిమాలు ఆడేవి కానీ ఇప్పుడు డైరెక్టర్ – హీరో కాంబినేషన్ సెట్ అయితే చాలు ఆ సినిమా ముందుగానే భారీ రేంజ్ లో బిజినెస్ ని చేసి సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ప్రొడ్యూసర్స్ ను సేఫ్ జోన్ లో ఉంచుతోంది… ఇక ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ లాభాలను తీసుకొస్తున్న దర్శకులు కొంతమంది ఉన్నారు. అందులో మొదటగా రాజమౌళి పేరు చెప్పుకోవాలి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడిగా ఇతను గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో మరోసారి స్టార్ డైరెక్టర్ గా తనను తాను ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఈయన సినిమా కోసం ఎంత బడ్జెట్ ని కేటాయించినా కూడా దానిని ఈజీగా కలెక్ట్ చేసి పెట్టగలిగే కెపాసిటీ ఈ దర్శకుడి దగ్గర ఉంది. అలాగే ఈయనకు మార్కెట్ కూడా అదే రేంజ్ లో ఉంది. రాజమౌళి సినిమా అంటే చాలు ఏది ఆలోచించకుండా టిక్కెట్ రేట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులందరు సినిమా థియేటర్ కి వచ్చి సినిమాని చూడాలి అనే ఒక అభిప్రాయంతో ఉంటారు. అంటే అతను ప్రేక్షకుల్లో ఎంతటి గొప్ప ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రాజమౌళి ఒక సినిమా కోసం 200 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకోవడం విశేషం…
అర్జున్ రెడ్డి సినిమా తో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డివంగ… అనిమల్ సినిమా సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం స్పిరిట్ సినిమా కోసం 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక తను కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండడంతో సినిమా కలెక్షన్స్ లో కూడా తనకు వాటా వస్తోంది కాబట్టి అన్ని కలుపుకొని 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకునే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి..
కేజిఎఫ్, సలార్ లాంటి సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఆయన 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. ఈజీగా తన పెట్టిన పెట్టుబడిని ప్రొడ్యూసర్లకు ప్రాఫిట్స్ రూపంలో రాబడుతున్న ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు తాజాగా రామ్ చరణ్ సినిమా కోసం 80 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉండడం విశేషం… ఇక అట్లీ సైతం 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళందరూ చేస్తున్న సినిమాలతో సౌత్ సినిమా ఇండస్ట్రీని టాప్ లెవెల్ కైతే తీసుకెళ్లారు. ఇక మన వాళ్ళతో పోలిస్తే బాలీవుడ్ దర్శకులు కొంతవరకు వెనకబడ్డారనే చెప్పాలి. అక్కడ టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న రాజకుమార్ హిరానీ సైతం 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు. సిద్దార్థ్ ఆనంద్ 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్ళతో పోలిస్తే మన దర్శకులు ముందంజలో ఉన్నారు…