Andhra King Taluka Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. మన స్టార్ హీరోలందరు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ప్రస్తుతం వీళ్ళు మంచి విజయాలను సాధించడమే కాకుండా వాళ్ళ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాలు గా నిలుపుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న రామ్ సైతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వంలో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమా చేస్తున్నాడు… ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లో పూర్తి కథను రివైల్ చేశారు…ఒక వ్యక్తి ఒక హీరోను విపరీతంగా అభిమానిస్తూ ఉంటాడు. కానీ తన హీరోను అభిమానించడం వల్ల తన కెరీర్ మొత్తాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఇదే క్రమంలో హీరో వచ్చి అభిమానికి ఎలా హెల్ప్ చేశాడు.
ఆ అభిమాని లేకపోతే హీరో ఈరోజు ఇలా ఉండేవాన్ని కాదని ఎలా రియలైజ్ అయ్యాడు అనేది ఈ సినిమా యొక్క కథాంశంగా తెలుస్తోంది. ఇక ట్రైలర్ అద్భుతంగా ఉండటమే కాకుండా తన నటన కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంది. గతంలో ఓవర్ యాక్టింగ్ చేసిన రామ్ గత కొద్దిరోజులుగా న్యాచురల్ యాక్టింగ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఆంధ్ర కింగ్ విషయంలో కూడా తను రియలెస్టిక్ గా నటించడానికి ఆసక్తి చూపించాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం రామ్ కెరియర్ మరో మెట్టు పైకెక్కుతోంది. లేకపోతే మాత్రం ఆయన కొంతవరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. నిజానికి ట్రైలర్లో విజువల్స్ గాని, హీరో హీరోయిన్ల మధ్య వచ్చిన కెమిస్ట్రీ గానీ చాలా బాగా వర్కౌట్ అయింది.
అలాగే బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. విజువల్స్ కూడా ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉన్నాయి. కానీ సినిమా ఫైనల్ గా ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…