Operation Sindoor: ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ ప్రేరేపత ఉగ్రవాదులు కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మంఇని చంపేశారు. దీనికి ప్రతిగా భారత్ మే నెలలో ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. వంద మంది ఉగ్రవాదులు ఇందులో దుర్మరణం చెందారు. అయితే దీనికి ప్రతిగా పాకిస్తాన్ భారత్‌లోని సరిహద్దు గ్రామాలు, ప్రజలపై దాడులు చేసింది. దీంతో భారత సైన్యం, వైమానిక దళాలు పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డాయి. 11 ఎయిర్ బేస్‌లను ధ్వసం చేశాయి. కిరాణాహిల్స్‌లోని పాకిస్తాన్ అణుస్థావరాన్ని కూడా భారత్ టచ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. రావల్పిండి సమీపంలోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్, జాకోబాబాద్ వంటి కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నూర్‌ఖాన్ బేస్ అణ్వస్త్ర దళాలకు కీలక కేంద్రంగా పరిగణించబడుతుంది. ఇదే కారణంగా ఆ దెబ్బ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపింది.
పాకిస్తాన్ అంతర్గత సంక్షోభం
డామియన్ సైమన్ లాంటి అంతర్జాతీయ రహస్య విశ్లేషకులు నూర్‌ఖాన్ బేస్‌లో జరిగిన నష్టం కిరాణా హిల్స్ వద్ద అణు సౌకర్యాలపై దెబ్బల వివరాలను ఇటీవల బయటపెట్టారు. షహబాజ్ షరీఫ్ సొంతంగా భారత్ దాడుల ప్రభావాన్ని అంగీకరించడం వారి అంతర్గత అస్పష్టత మరియు రక్షణ వైఫల్యాన్ని బహిర్గతం చేసింది. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పటికీ, పాకిస్తాన్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించలేకపోతోంది.
పాకిస్తాన్‌కు ఓ గుణపాఠం..
నాలుగు రోజుల యుద్ధ వ్యవధిలో భారత్ పరిమిత నష్టంతో గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఆపరేషన్ ద్వారా న్యాయసమ్మత ప్రతీకారం మాత్రమే కాదు, సరిహద్దు దాటి కూడా లక్ష్యాన్ని సాధించే భారత సైన్యం సామర్థ్యాన్ని ప్రపంచం గమనించింది. మరోవైపు, పాకిస్తాన్ అణు భద్రత, సైనిక సమన్వయంలో ఉద్రిక్తతలు స్పష్టమయ్యాయి.
ఆపరేషన్ సిందూర్ భారత సైనిక చరిత్రలో ఒక వ్యూహాత్మక ఉదాహరణగా నిలుస్తోంది. పహల్గాం ఉగ్రవాదానికి ఇచ్చిన బదులు పాకిస్తాన్ అంతర్గత భద్రతను కుదిపేసి, సరిహద్దు దాటి దాడులకు భారత్ తగిన శక్తి చూపిందని రక్షణ నిపుణుల విశ్లేషణలు సూచిస్తున్నాయి.