‘లవ్ స్టోరి’ సినిమా సక్సెస్ సంబరాల్లో అక్కినేని ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. కానీ అక్కినేని కోడలు సమంత మాత్రం ఒంటరిగా బాధ పడుతూ ఇంట్లోనే కూర్చుంది. మొదట ఈ సక్సెస్ మీట్ కి సామ్ ను కూడా తీసుకురావాలని నాగార్జున భావించారు. పైగా నాగ్, సామ్ కి సక్సెస్ మీట్ కి రమ్మని కూడా ఆదేశించాడు. కానీ, కారణాలు తెలియదు గానీ, సమంత మాత్రం లవ్ స్టోరీ సక్సెస్ మీట్ లో కనిపించలేదు.

సమంత రావడం చైతుకి ఇష్టం లేదు అని, అందుకే ఆమె నాగార్జున పిలిచినా రాలేదు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. చైతు – సామ్ వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకున్నా.. అది మంచిది కాదు అని భావించి చివరికి నాగార్జున కూడా సైలెంట్ అయిపోయాడట. ఇక లవ్ స్టోరీ విజయోత్సవ వేడుకకు నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి చాలా విషయాలే మాట్లాడాడు.
తెలుగు సినిమా రంగానికి ‘లవ్ స్టోరి’ సినిమా ఒక ఊపు తెచ్చింది అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, తన కొడుకు చైతుని ఈ సినిమా స్టార్ యాక్టర్ ను చేసింది అని సగర్వంగా చెప్పుకొచ్చాడు నాగ్. అంటే.. చైతుకి ఇప్పటివరకూ స్టార్ డమ్ లేదు అని అంగీకరించినట్లేనా ? మరోపక్క ఈ సినిమాలో హైలైట్ చైతు నటనే అన్నట్టు నాగ్ మాట్లాడాడు.
నిజానికి సినిమా చూశాక, చైతుని సాయి పల్లవి పూర్తిగా డామినేట్ చేసింది అని టాక్ వినిపించింది. మొత్తమ్మీద నాగార్జున చైతును ప్రమోట్ చేయడానికి ముందుగానే స్క్రిప్ట్ రాసుకుని వచ్చినట్లు ఉన్నాడు. ఇక పనిలో పనిగా దర్శకుడు శేఖర్ కమ్ములకి కూడా నాగార్జున స్పెషల్ థాంక్స్ చెప్పాడు.
నాగార్జున మాటల్లోనే ‘జనరల్ గా యాక్టర్, స్టార్ వేర్వేరు. కానీ, మా వాడిని స్టార్ యాక్టర్ గా మార్చారు దర్శకుడు శేఖర్ కమ్ములగారు. చైతుని న్యూ జర్నీలో తీసుకెళ్లావు శేఖర్’ అంటూ నాగార్జున చెబుతూ ఉంటే.. శేఖర్ కమ్ముల కూడా నా గురించేనా మాట్లాడుతుంది అన్నట్టు డౌట్ గా చూశాడు. మొత్తానికి ప్లాన్డ్ గా స్క్రిప్ట్ రాసుకుని వచ్చాడు నాగ్.