
Rajamouli – Janhvi Kapoor : దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ భామ జాన్వికపూర్ కలిసున్న లేటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. జక్కన్న ఏదో బుక్ ను జాన్వికి ఇవ్వగా.. దానిపై ఆమె ఓ సంతకం పెట్టేస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో సినిమా ఒప్పందం జరిగిందని ప్రచారం సాగుతోంది. రాజమౌళి తరువాతి సినిమా మహేష్ బాబుతో ఉంటుంది. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత వీరి సినిమా మొదలవుతుంది. ఈ నేపథ్యంలో తరువాతి సినిమా కోసం రాజమౌళి ముందే జాన్వితో అగ్రిమెంట్ రెడీ చేసుకుంటున్నాడా? అని అనుకుంటున్నారు. కానీ ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. జాన్వి సంతకం చేసిన విషయం వాస్తవమే. కానీ అందుకు కాదు. మరెందుకంటే?
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా తీస్తున్నాడు. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు ఎన్టీఆర్ తో మరో సినిమా తీస్తున్నాడు. తాత్కాలికంగా దీనికి #NTR30 పేరు పెట్టారు. ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ మార్చి 23న జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ తోపాటు రాజమౌళి కూడా హాజరయ్యారు. అట్టహాసంగా #NTR30 ను లాంచ్ చేశారు. ఇప్పటి నుంచి షూటింగ్ రెగ్యులర్ గా ఉంటుందని కొరటాల శివ చెప్పారు.
ఇక ఇందులో ఎన్టీఆర్ కు జోడిగా బాలీవుడ్ భామ జాన్వికపూర్ నటిస్తోంది. #NTR30 ఓపెనింగ్ కు ఆమె కూడా హాజరైంది. ఎన్టీఆర్, జాన్విల మధ్య ఓ సీన్ ను తీశారు. దీనికి రాజమౌళి క్లాప్ కొట్టారు. బాలీవుడ్ భామ జాన్వి మొదటిసారి తెలుగులో నటిస్తోంది. అదీ జూనియర్ ఎన్టీఆర్ తో నటించడంతో నందమూరి ఫ్యాన్ష్ ఫుల్ జోష్ లో ఉన్నారు. హీరో ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ విజేతగా నిలిచిన ఆర్ఆర్ఆర్ తరువాత సినిమా ఇది కావడంతో ఇండస్ట్రీలోనూ ఆయనపై హోప్స్ బాగానే పెరుగుతున్నాయి.
ఈ సందర్భంగా రాజమౌళి, జాన్వి కపూర్ కలిసి మాట్లాడుతున్న ఫొటొలు హైలెట్ గా నిలిచాయి. అంతేకాకుండా రాజమౌళి ఏదో బుక్ ఇవ్వగా దానిపై జాన్వి కపూర్ సంతకం చేస్తున్నారు. దీంతో రాజమౌళి నెక్ట్స్ తీయబోయే సినిమాకు సైన్ చేయించుకుంటున్నారని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. కానీ అసలు విషయం అది కాదు. రాజమౌళి కూతురు మయూక కు జాన్వికపూర్ అంటే బాగా ఇష్టం. ఆమెకు పెద్ద ఫ్యాన్. అందువల్ల ఆమెను కలవాలని మయూక ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. కానీ సాధ్యం కావడం లేదు.
అయితే రాజమౌళి ఎలాగూ #NTR30 ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా కూతురి కోరిక మేరకు జాన్వీ కపూర్ తో ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ముందుగా తెల్లపేపర్ పై జాన్వీ తీసుకోవాలని రాజమౌళి ట్రై చేశారు. కానీ జాన్వి మాత్రం తెల్ల పేపర్ వద్దు అని చెప్పి ఏదైనా సందేశం ఇవ్వాలని భావించారట. ఆ తరువాత కొన్ని ఆదర్శవంతమైన మాటలను ఉంచి దానిపై సంతకం చేశారట. అయితే అందరు మాత్రం రాజమౌళి సినిమా కోసం ఒప్పందం చేసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు.