Senior Heroes: సినిమా ఇండస్ట్రీలో ఎవరి క్రేజ్ అయిన కూడా కొద్దిరోజుల వరకే ఉంటుంది… ఇక ఇప్పటికే మనం చాలా మంది హీరోలని, హీరోయిన్లని చూశాం. కొందరి హవా కొద్దిరోజులు నడిస్తే, మరి కొద్ది స్టార్ డమ్ మరికొన్ని రోజుల పాటు సాగుతూ ఉంటుంది. ఇలా ఇండస్ట్రీలో ఎవ్వరూ కూడా శాశ్వతంగా ఉండిపోరు.
ప్రతి శుక్రవారం ఒక సినిమా వస్తుంది ఆ సినిమాలో ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళు మరొక శుక్రవారం వరకు స్టార్లుగా కొనసాగుతారు. ఆ తర్వాత మరో హిట్ సినిమాతో ఇంకో స్టార్ బయటికి వస్తాడు ఇలా ఇండస్ట్రీ అనేది ఎప్పుడు ఒకరి తోనే ఆగిపోదు. అందుకే ఫ్లాప్ ల్లో ఉన్నవాళ్లు హిట్లు తీస్తారు, హిట్ సినిమాలు తీసిన వాళ్ళు ప్లాపులు తీస్తారు ఇక్కడ ఇదంతా కామన్. కానీ 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్,బాలయ్య, నాగార్జున ల పరిస్థితి ఇప్పుడు హిట్టు కి ప్లాప్ కి మధ్యలో కొట్టుమిట్టాడుతుంది అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల పైన విమర్శలను చేస్తున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు చేస్తున్న సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకుల్ని అలరించడం లేదు. ఇక ఇప్పటికీ కూడా వీళ్ళు హీరోయిన్స్ తో ఆడి పాడి రొమాన్స్ చేసే సినిమాలు చేయడం కరెక్ట్ కాదు అంటూ సినీ విమర్శకులు ప్రతిసారీ వీళ్లని విమర్శిస్తూ వస్తున్నారు. ఇక 70 సంవత్సరాల వయసులో కూడా వీళ్ళు రొమాన్స్ చేస్తుంటే చూసే వాళ్ళు ఏంటి స్వామి అంటూ వీళ్ళ గురించి వ్యంగంగా విమర్శిస్తున్నారు. అయితే బాలయ్య భగవంత్ కేసరి లాంటి సినిమా చేసి విమర్శకుల ప్రశంశలు పొందినప్పటికీ వెంకటేష్, నాగార్జున కూడా ఇలాంటి పాత్రలు చేయాలి ఇక చిరంజీవి ప్రస్తుతం ఇలాంటి పాత్ర లు చేయడానికి సిద్దం అయ్యాడు.అందులో భాగంగా వస్తుందే విశ్వంభర సినిమా…
ఇక నాగార్జున నుంచి కూడా ఇలాంటి సినిమాలనే జనం ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక రీసెంట్ సోషల్ మీడియా మొత్తం సీనియర్ హీరోలు వాళ్ల ఏజ్ కి తగ్గ పాత్రలు చేయాలంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు…