https://oktelugu.com/

Varun Tej: ఇంత వరకు వరుణ్ తేజ్ భార్య లావణ్యను అడగని ఒకే ఒక విషయం… ఆలస్యంగా వెలుగులోకి

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో తన వైఫ్ లావణ్య త్రిపాఠి గురించి కొన్ని ప్రశ్నలు ఎదురవగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 28, 2024 / 04:52 PM IST
    Follow us on

    Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా నటించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో తన వైఫ్ లావణ్య త్రిపాఠి గురించి కొన్ని ప్రశ్నలు ఎదురవగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ మిస్టర్ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత అంతరిక్షం చిత్రం లో కలిసి నటించారు.

    కానీ వాళ్ళ రిలేషన్ అసలు బయట పెట్టలేదు. పైగా తమ మధ్య అలాంటి బంధం లేదని ఖండిస్తూ వచ్చారు. సడన్ గా నిశ్చితార్థం ప్రకటన చేసి షాక్ ఇచ్చారు. గత ఏడాది నవంబర్ లో పెళ్లి చేసుకుని ఒక్కటవ్వడం జరిగింది. కాగా… మీ చిత్రాల్లో లావణ్య త్రిపాఠికి బాగా నచ్చిన మూవీ ఏది అని వరుణ్ ని మీడియా ప్రతినిధులు అడిగారు. ఇందుకు వరుణ్ తేజ్ .. ఇంతవరకు లావణ్య ను ఆ ప్రశ్న అడగలేదని తెలిపారు. అలాగే భవిష్యత్తులో మీరు కలిసి నటిస్తారా అని అడగ్గా .. మంచి కథ దొరికితే తప్పకుండా నటిస్తాం.

    కానీ హడావిడిగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అని కాదని వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ఆపరేషన్ వాలెంటైన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది. మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా నటిస్తున్నారు. వైవిధ్యమైన కథలతో కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించడంలో వరుణ్ ఎప్పుడూ ముందే ఉంటారు. హిట్ లు ఫ్లాప్ లతో పట్టించుకోకుండా కొత్త కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

    మరోవైపు వరుస పరాజయాలతో వరుణ్ ఇబ్బంది పడుతున్నారు. ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆపరేషన్ వాలెంటైన్ తో హిట్ కొట్టాలని, వరుణ్ ప్రమోషన్స్ విషయంలో బాగా కష్టపడుతున్నాడు. పుల్వామా ఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులో వార్, దేశ భక్తి అంశాలు ఉంటాయి. ఇక సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి.