Actress Charmy Kaur: ‘లైగర్’ సినిమా విడుదల వేళ ఆ సినిమా కోసం పడ్డ కష్టాన్ని అంతా దర్శకుడు, నిర్మాత, హీరో ముగ్గురూ బయటపెడుతున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయగా.. చార్మి నిర్మించారు. విజయ్ దేవరకొండ ఎంతో కష్టనష్టాలకు ఓర్చి ఇందులో నటించారు. ఈ సినీ కష్టాలను తాజాగా పంచుకున్నారు. ఏకంగా చార్మి కన్నీళ్లు పెట్టుకున్నారు.

2019లో లైగర్ కథను విని విజయ్ దేవరకొండ ఓకే చెప్పి షూటింగ్ ప్రారంభించారని.. ఈ సినిమాకు కరోనా వేళ రూ.200 కోట్ల ఓటీటీ భారీ ఆఫర్ వచ్చిందని చార్మి ఎమోషనల్ అయ్యారు. అప్పుడు చేతిలో రూపాయి లేక ఇబ్బందులు పడుతుంటే ఆఫర్ ను తిరస్కరించడానికి ధైర్యం చాల్లేదని చార్మి కన్నీళ్ల పర్యంతం అయ్యారు.
Also Read: Varun Tej Wedding Fix: నవంబర్ నెలలో వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్..పెళ్లికూతురు ఎవరో తెలుసా ?
జేబులో ఒక్క రూపాయి లేని వేళ అంత భారీ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి దమ్ము కావాలని.. కానీ ఆ దమ్మున్న వ్యక్తి పూరి జగన్నాథ్ అని చార్మి చెప్పుకొచ్చారు. ఇది థియేటర్ ఫిల్మ్ అని.. అందుకే ఓటీటీ ఆఫర్ వచ్చినా తిరస్కరించాడని చార్మి చెప్పుకొచ్చింది.
పూరి కూడా ఈ సినిమా జర్నీలో కొన్ని సార్లు నిరాశపడ్డాడని.. కానీ విజయ్ దేవరకొండ మమ్మల్ని నడిపించాడని.. రెండోది మూవీ కంటెంట్ సినిమా కథనే మమ్మల్ని నడిపించిందని చార్మి ఎమోషనల్ అయ్యారు.

మొత్తంగా కరోనా టైంలో చేతిలో రూపాయి లేకున్నా రూ.200 కోట్ల ఓటీటీ ఆఫర్ ను కూడా పూరి జగన్నాథ్ తిరస్కరించాడంటే ఈ సినిమాపై పూరికి, విజయ్ కు ఎంత కాన్ఫిడెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్ లో అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు.
[…] Also Read: Actress Charmy Kaur: కరోనా వేళ చేతిలో రూపాయి లేదు.. … […]