Liger Story Leaked: తెలుగు బాక్సాఫీస్ వద్ద ప్రజెంట్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మేనియా టాలీవుడ్ ను పూర్తిగా కమ్మేసింది. సిల్వర్ స్క్రీన్స్ పై మ్యాజిక్ చేయడానికి లైగర్ హడావిడీ పీక్స్ కు వెళ్ళింది. ఇప్పటికే థియేటర్స్ అన్నీ ‘ లైగర్’ కోసం బుక్ చేసి ఉంచారు. వచ్చే వారం రాబోతున్న లైగర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, విజయ్ దేవరకొండ మేనియాతో ఇంతకూ ముందు రికార్డ్స్ అన్నీ చెల్లాచెదురు అయిపోవడం ఖాయం అంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు బాలీవుడ్, యూఎస్ మార్కెట్ లోనూ.. లైగర్ కలెక్షన్ల కేకలను భారీ స్థాయిలో పెట్టించేలా ఉన్నాడు విజయ్.

ఇక `లైగర్` సినిమా కథకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో ప్రముఖ అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటించిన సంగతి తెలిసిందే. మైక్ టైసన్‌కీ ఈ కథకీ ఉన్న సంబంధం ఏమిటి? తను అసలు ఈ కథలోకి ఎలా వస్తాడు? అనేది సినిమాలో మెయిన్ పాయింట్ అట. హీరో విజయ్ దేవరకొండ.. మైక్ టైసన్ కి అభిమానిగా నటిస్తున్నాడు. టైసన్‌తో ఓ సెల్ఫీ తీయించుకోవాలని మన `లైగర్` డ్రీమ్. అయితే, చివరికి క్లైమాక్స్ ఫైట్ లో.. టైసన్‌తోనే తలపడి గెలుస్తాడు.
విజయ్ తన కలని నిజం చేసుకోవడానికి చేసిన కృషి ఏమిటి ?, ఈ మధ్యలో మదర్ సెంటిమెంట్ ఎంత బాగా వర్కౌట్ అయ్యింది ? అనేది సినిమా మెయిన్ ప్లాట్. ఇది వరకు `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి`లో మదర్ సెంటిమెంట్ చూపించాడు పూరీ. అది కూడా బాక్సింగ్ కథే. అందుకే ఈ రెండు సినిమాలకూ పోలిక తీసుకొస్తున్నారు అభిమానులు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ.. విజయ్ ఫ్యాన్స్ లో రోజురోజుకు ఈ సినిమా పై ఆసక్తి రెట్టింపు అవుతుంది. ‘లైగర్’ సినిమాకి భారీగా బిజినెస్ జరుగుతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను లైగర్ థియేటర్ రైట్స్ ను కొనుక్కున్నారు. లైగర్ సినిమా పాన్ ఇండియా సినిమా. అన్నీ సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా లైగర్ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఈ క్రమంలో వరంగల్ శ్రీను షాకింగ్ రేట్ కి లైగర్ దక్షిణాది రాష్ట్రాల థియేటర్ రైట్స్ కొనుక్కున్నాడు. ఇంతకీ ఆ రేట్ ఎంత అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా ?. ఏకంగా 70 కోట్లకు లైగర్ రైట్స్ కొన్నాడు వరంగల్ శ్రీను. ఆంధ్ర ఏరియాను 30 కోట్ల రేషియోలో కొన్నాడు. మొత్తానికి లైగర్ సినిమాకి ఊహించని విధంగా బిజినెస్ జరుగుతుంది. మొత్తానికి స్టార్ హీరోల రేంజ్ లో విజయ్ దేవరకొండ తన లైగర్ బిజినెస్ తో సరికొత్త రికార్డులు నమోదు చేశాడు.
Also Read:Varun Tej Wedding Fix: నవంబర్ నెలలో వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్..పెళ్లికూతురు ఎవరో తెలుసా ?
[…] […]