Actress Hema Malini: సీనియర్ నటుడు ధర్మేంద్రను హీరోయిన్ హేమ మాలిని రెండో వివాహం చేసుకున్నారు. 1980లో వీరికి వివాహమైంది. ఇద్దరు కూతుళ్లు పుట్టారు. ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ కి ఐదుగురు సంతానం. అబ్బాయిలు సన్నీ డియోల్, బాబీ డియోల్ హీరోలయ్యారు. మిగతా ముగ్గురు అమ్మాయిలు. చాలా కాలంగా హేమ మాలిని భర్త ధర్మేంద్రకు దూరంగా ఉంటుంది. ఈ విషయం పై హేమమాలిని తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు.
మీరు ఫెమినిస్ట్ ఐకాన్ కదా? భర్తకు దూరంగా జీవించడానికి ఇది కూడా కారణమా? అని అడగ్గా… ఆమె చిన్నగా నవ్వారు. భర్తకు దూరంగా ఉండాలని ఎవరూ కోరుకోరు. ప్రతి భార్య భర్త, పిల్లలతో కలిసి జీవించాలనుకుంటుంది. కానీ జీవితం ఏమిస్తుందో అది స్వీకరించాలి. మనం కలిసి బ్రతకాలని జీవించాలని అనుకున్నప్పటికీ లెక్కలు తప్పుతాయి. ఎవరికీ జీవితం ఇలా ఒంటరిగా జీవించాలని కోరుకోరు అన్నారు.
భర్తకు దూరంగా ఉంటున్నందుకు నేనేమీ బాధపడటం లేదు. నేను నాతో ఆనందంగా జీవిస్తున్నాను. నాకు ఇద్దరు కూతుళ్లు. వాళ్ళను నేను గొప్పగా పెంచాను. ధర్మేంద్ర మాత్రం అక్కడే ఉండేవాడు. అయితే పిల్లల పెళ్లిళ్లు జరగాలని ఆశపడేవాడు. అదే విషయం ప్రస్తావిస్తూ ఉండేవాడు. నేను జరగాల్సినప్పుడు జరుగుతాయి. వాళ్లకు సరైన జోడి రావాలని నచ్చజెప్పేదాన్ని. దేవుడు, గురువుల దయతో మా అమ్మాయిల పెళ్లిళ్లు అయిపోయాయి. మేము అనుకున్నది ప్రతిదీ జరిగిందని, హేమ మాలిని అన్నారు.
ఇటీవల ధర్మేంద్ర మనవడు వివాహం జరిగింది. ఆ పెళ్ళికి హేమ మాలిని, ఆమె కుమార్తెలు హాజరు కాలేదు. అందుకు ధర్మేంద్ర ఒకింత ఎమోషనల్ అయ్యారు. ఆయన సోషల్ మీడియా వేదికగా వేదన వ్యక్తం చేశాడు. ధర్మేంద్ర గురించి హేమమాలిని తాజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.