https://oktelugu.com/

hero : తినడానికి తిండి లేదు…కట్ చేస్తే ఇండియా ను శాశించే హీరోగా ఎదిగాడు…

సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు ఎవరైనా సరే వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 10, 2024 / 12:35 PM IST

    rajinikanth

    Follow us on

    hero : సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు ఎవరైనా సరే వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంటారు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా పేరుపొందిన రజినీకాంత్ లాంటి నటుడు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. ఇక ఆయన స్టైల్ ను మ్యాచ్ చేసే హీరో అయితే ఇప్పటివరకు మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

    సినిమా ఇండస్ట్రీలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు. అయితే ఇక్కడ కొంతమందికి సక్సెస్ లు వస్తుంటే మరి కొంతమందికి మాత్రం వరుసగా ప్లాప్ లు ఎదురవుతూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడంలో మాత్రం చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు. ఇక అదే క్రమంలో రజనీకాంత్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. మరి ఆయన నట ప్రస్థానం ఎక్కడ మొదలైంది.తినడానికి తిండి కూడా లేని ఒక పేద కుటుంబం నుంచి ఆయన ఎంత స్థాయికి ఎదిగాడు అనేది తీసుకునే ప్రయత్నం చేద్దాం… 1955 సంవత్సరం మహారాష్ట్రలో జన్మించిన శివాజీ రావ్ గైక్వాడ్ ఆ తర్వాత రజనీకాంత్ గా మారి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాశించే స్థాయికి ఎదిగాడనే చెప్పాలి…

    ఇక కర్ణాటకలో ఆయన కొద్ది రోజులపాటు బస్ కండక్టర్ గా జాబ్ చేస్తున్న సమయంలో అతని వాకింగ్ స్టైల్ గాని, అతను సిగరెట్ తాగే స్టైల్ నచ్చిన తన ఫ్రెండ్ అతన్ని చూసి నువ్వు సినిమాలో ట్రై చేయవచ్చు కదా నీ స్టైల్ బాగుందని చెప్పడంతో ఆయన ఎట్టకేలకు మద్రాస్ లోని ఒక ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కు సంబంధించిన శిక్షణను తీసుకున్నాడు.

    1975 వ సంవత్సరంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగల్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక అప్పటికే తూర్పు పడమర అనే సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది దాంతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా తారస్థాయికి వెళ్ళిపోయింది. ఇక అప్పటినుంచి సోలో హీరోగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.

    ఇక తన ఎంటైర్ కెరియర్ లో ముత్తు,అరుణాచలం, భాషా,నరసింహ, చంద్రముఖి,శివాజీ,రోబో లాంటి సినిమాలు అతనికి ఎనలేని గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను కూడా ఏర్పాటు చేశాయి… ఇక తినడానికి తిండి లేని స్థాయి నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని పొందే అంతవరకు ఎదిగిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

    Tags