Sandeep Reddy Vanga in god room: చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. పాన్ ఇండియాలో తనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనంతలా ‘ అనిమల్ ‘ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి చూపించాడు. ఇక ప్రస్తుతం ఆయన సినిమాలో నటించడానికి చాలామంది నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే ఒక ఇద్దరు నటులు మాత్రం తమ జీవితకాలంలో సందీప్ రెడ్డి వంగ కి రుణపడి ఉంటామని చెప్పాడు. అలాగే మా ఇంటి పూజ గదిలో సందీప్ ఫోటో ను పెట్టుకుంటాం అని చెబుతుండడం విశేషం…
ఇంతకి ఆ నటులు ఎవరు అంటే అనిమల్ సినిమాలో విలన్ గా నటించిన ‘బాబి డియోల్’ ఒకరు కాగా, అదే మూవీలో మరొక విలన్ గా నటించిన పెళ్లి మూవీ ఫేమ్ ‘పృథ్వీ’ కావడం విశేషం… ఇక అనిమల్ సినిమా తర్వాత ఆయన దాదాపు 20 సినిమాలకు కమిట్ అయ్యాడు. అప్పటి వరకు అసలు సినిమాలు లేకుండా ఖాళీగా ఉంటున్న బాబీ డియోల్ ను సిసిఎల్ మ్యాచులు జరుగుతున్నప్పుడు ఆయన ఇచ్చిన స్టిల్ సందీప్ రెడ్డివంగ కి బాగా నచ్చిందట…
ఇక తన రాసుకున్న అబ్రార్ క్యారెక్టర్ కి సెట్ అవుతాడని తనను అప్రోచ్ అయి అతని చేత ఆ క్యారెక్టర్ చేయించాడు. మొత్తానికైతే అతను చేసిన క్యారెక్టర్ లో విలనిజాన్ని పండించడంలో నటుడిగా అటు బాబు డియోల్, తను అనుకున్నది రాబట్టుకోవడం లో ఇటు సందీప్ రెడ్డి సూపర్ సక్సెస్ అయ్యారు. అందువల్ల అతనికి చాలా మంచి అవకాశాలైతే వస్తున్నాయి.
ఇక పృథ్వి చేసిన పాత్ర కోసం మొదట ప్రొడ్యూసర్స్ వేరే ఆర్టిస్ట్ తో చేద్దామని చెప్పినప్పటికి సందీప్ మాత్రం నేను రాసుకున్న క్యారెక్టర్ కి పృథ్వి అయితేనే న్యాయం చేస్తాడని చెప్పి మరి అతన్ని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ చేశాడు. ఇక అనిమల్ లో విలన్ క్యారెక్టర్స్ చేసిన ఈ ఇద్దరు నటులు వాళ్ళ పూజ గదిలో సందీప్ రెడ్డి వంగ ఫోటో ను పెట్టుకుంటామని పలు ఇంటర్వ్యూ ల్లో చెప్పడం విశేషం…