Homeఎంటర్టైన్మెంట్Brahmotsavam: మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ వెనుక ఎవ్వరికీ తెలియని పెద్ద స్టోరీ ఉంది..ఏంటంటే..

Brahmotsavam: మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ వెనుక ఎవ్వరికీ తెలియని పెద్ద స్టోరీ ఉంది..ఏంటంటే..

Brahmotsavam: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత రాజకుమారుడు అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు మహేష్ బాబు. మొదటి సినిమాతోనే హీరోగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇక గత ఏడాది మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ హిట్ సొంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సరిపెక్కుతున్న ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ బాబు కెరీర్ లో ఈ సినిమా 29వ సినిమాగా తెరకెక్కబోతోంది. అలాగే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇదే. అయితే మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో బ్రహ్మోత్సవం, వన్ నేనొక్కడినే, స్పైడర్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. బ్రహ్మోత్సవం సినిమా పరాజయం పొందడంతో పాటు మహేష్ బాబు పరువు మొత్తం తీసేసింది. బ్రహ్మోత్సవం సినిమాకి ముందు మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబుకు శ్రీకాంత్ అడ్డాల మీద మంచి నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత శ్రీమంతుడు సినిమా షూటింగ్ క్లైమాక్స్ జరుగుతున్న సమయంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబు దగ్గరకు వచ్చి మంచి ఫ్యామిలీ స్టోరీ అని కథ చెప్తుండగా మహేష్ బాబు శ్రీకాంత్ పై ఉన్న నమ్మకంతో వెంటనే పూర్తిగా వినకుండా ఓకే చెప్పేసారట. పూర్తి స్క్రిప్ట్ రెడీ కాకముందే సినిమా సెట్స్ మీదకు వెళ్ళిపోయిందట. ఇక సగం సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కథ ఇంకా పూర్తిగా రెడీ కాలేదు అన్న సంగతి మహేష్ బాబుకు తెలిసిందట.

దాంతో ఇక ఆ తర్వాత తన చెయ్యి దాటిపోయింది, ఇక చేసేది ఏమీ లేదు అంటూ ఆ సినిమా డిజాస్టర్ అవుతుంది అని మహేష్ బాబుకు తెలిసిపోయింది. దీంతో ఆ సినిమా డిజాస్టర్ కావడంతో పాటు మహేష్ బాబు పరుగు కూడా తీసేసింది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం లో చేస్తున్న సినిమాకు ప్రేక్షకులలో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.దీనికి ప్రధాన కారణం ఈ సినిమాను రాజమౌళి హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించడం.ఈ సినిమాలో పలు బాలీవుడ్ మరియు హాలీవుడ్ నటీనటులు కూడా కనిపించబోతున్నారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version