https://oktelugu.com/

Tollywood: ఆ సూపర్ హిట్ సాంగ్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మలను గుర్తుపట్టారా..?

పాల్గుణి పఠాక్ పాడిన మేరీ చునర్ జాయే పాటలో సినిమా ఇండస్ట్రీని ఏలిన ఇద్దరు హీరోయిన్లు ఆ పాటలో కనిపించారనే విషయం మనలో చాలామందికి తెలియదు.

Written By:
  • Gopi
  • , Updated On : May 4, 2024 / 02:20 PM IST

    Trisha And Ayesha Takia In Falguni Pathak Meri Chunnar Song

    Follow us on

    Tollywood: మనలో చాలామంది సినిమాల్లో వచ్చే పాటలను వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మరి కొందరైతే కొంతమంది సింగర్లకు ఫాన్స్ గా కూడా మారిపోతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లోనే బాలీవుడ్ లో “పాల్గుణి పఠాక్” అనే సింగర్ అప్పట్లో చాలా మంచి పాటలను పాడేది. ఇక అలానే తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ జనరేషన్ కి ఆమె ఎవరో పెద్దగా పరిచయం లేనప్పటికీ 90 స్ కిడ్స్ కి మాత్రం ఆమె సూపరిచితమనే చెప్పాలి. జోడే రేజో రాజ్, హవా హమే ఉదతి జాయే, మేరీ చునర్ ఉద్ద్ ఉద్ద్ జాయె, అయ్యో రామా వంటి సాంగ్స్ అప్పట్లో కుర్రకారులను ఉర్రుతలుగించాయి.

    ఇక అందులో భాగంగానే ఆమె పాడిన మేరీ చునర్ జాయే పాటలో సినిమా ఇండస్ట్రీని ఏలిన ఇద్దరు హీరోయిన్లు ఆ పాటలో కనిపించారనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఆ ఇద్దరు హీరోయిన్లు తెలుగు, తమిళ్ లాంగ్వేజ్ లలో అద్భుతమైన విజయాలను అందుకొని తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకున్నవారు కావడం విశేషం… ఇక అందులో ఒకరు నాగార్జున హీరోగా సూపర్ సినిమాతో తెలుగులో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ‘అయేషా టాకీయా’ కాగా, మరొకరు తెలుగు, తమిళ్ లాంగ్వేజ్ లో టాప్ హీరోయిన్ గా 20 సంవత్సరాల పాటు కొనసాగుతున్న హీరోయిన్ ‘త్రిష ‘…

    ఇక త్రిష 1983 మే 4వ తేదీన మద్రాస్ లో జన్మించింది. త్రిష 1999 వ సంవత్సరంలో మిస్ చెన్నై టైటిల్ ను గెలుచుకుంది. ఇక తర్వాత మలయాళ డైరెక్టర్ అయిన ప్రియదర్శన్ ‘లేసా లేసా ‘ అనే సినిమాలో తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఇక అప్పటినుంచి ఆమె వెను తిరిగి చూడకుండా తెలుగు, తమిళ్, మలయాళం,హిందీ అన్ని భాషల్లో సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తుంది.

    ఇక తెలుగులో మాత్రం ప్రభాస్ తో చేసిన వర్షం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈరోజు తన బర్త్ డే కావడంతో ఆమెకు సంబంధించిన విషయాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం త్రిష చిరంజీవితో విశ్వంభర అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఇక దాదాపు 20 సంవత్సరాలకు పైన స్టార్ హీరోయిన్ గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. కానీ త్రిష ఇప్పటికీ కూడా స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది…