Heroine Sadha: లంగా వోణి.. చేతిలో రెండు పుస్తకాలు.. తక్కువ మాట్లాడుతూ.. సాంప్రదాయాలు పాటిస్తూ.. తల్లిదండ్రులు చెప్పిన వ్యాఖ్యలను శ్రద్ధగా వినే అమ్మాయిలా సదాను చూశాం.. అమ్మాయి అంటే ఇలా ఉండాలి.. అని అనుకున్నారు కొందరు కుర్రాళ్లు.. అలాంటి సదా ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. హాట్ హాట్ డ్రెస్సులు వేస్తూ అదరగొడుతున్నారు. సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా టీవీ షోల్లో సదా వేసే డ్రెస్సులు చూసి షాక్ అవుతున్నారు. ఎలాంటి అమ్మాయి.. ఎలా మారిపోయిందని చర్చించుకుంటున్నారు. ఇంతకీ సదా ఇప్పుడేం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
మహారాష్ట్రలోని రత్నగిరిలో సదా 1984 ఫిబ్రవరి 17న జన్మించారు. ఆమె తండ్రి వైద్యుడు. తల్లి బ్యాంకు ఉద్యోగి. ఆమె పై చదువుల కోసం ముంబైకి వచ్చారు. 2002లో తేజ ‘జయం’ సినిమా హీరోయిన్ కోసం వెతుకుతుండగా సదా చూసి సెలెక్ట్ చేశారు. ఈ సినిమాలో సదా అచ్చ తెలుగు అమ్మాయిలా నటించారు. సాంప్రదాయంలా కనిపించిన ఈమె తెలుగమ్మాయేనని అనుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తరువాత సదా కు ఆఫర్లు ఇంటి తలుపు తట్టాయి. సౌత్ డైరెక్టర్ శంకర్ తీసిన ‘అపరిచితుడు’తో సదా మరింత ఫేమస్ అయింది.
ఇలా సినిమాలు కొనసాగిస్తున్న తరుణంలో సదా తల్లి 2015లో క్యాన్సర్ కు గురయ్యారు. దీంతో సినిమాలన్నీ పక్కనబెట్టి తల్లిని చూసుకునేవారు. కొన్నాళ్ల తరువాత సదాకు ఆఫర్లు రాకుండా పోయాయి. అయితే టీవీ షోల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. తెలుగులో ప్రముఖంగా రన్ అవుతున్న ‘ఢీ’ షోలో ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా సదా జడ్జిమెంట్ ను చూసి ఆశ్చర్యానికి గురవుతారు.
ఈ సందర్భంగా సదా జడ్జిగా ఉంటూనే సందర్భాన్ని భట్టి డ్యాన్స్ కూడా చేస్తారు. ఓ సారి ఆమె వేసుకున్న స్లీవ్ లెస్ డ్రెస్ ను చూసి అంతా షాక్ అయ్యారు. ఇందులో ఆమె హాట్ గా కనిపించారు. కొన్ని సినిమాల్లో సదా గ్లామర్ షో చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టీవీ షోల్లోనూ హాట్ హాట్ డ్రెస్సులతో అదరగొడుతుండడంతో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి..