Director Sukumar: ఒక సినిమాకు అందమైన హీరోయిన్ ఎంపికైందంటే అందుకు డైరెక్టరే కారణం. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరితేనే సినిమా హీరోయిన్ నటన అద్భుతంగా వస్తుందని ఇండస్ట్రీలో టాక్. ఇలా వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఒక్కోసారి లవ్లో పడుతారు.. ఆ తరువాత పెళ్లి కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే చాలా వరకు డైరెక్టర్, హీరోయిన్ల మధ్య వచ్చిన వార్తలు పుకార్లుగానే మిగిలాయి. లేటేస్టుగా మరో న్యూస్ సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతుంది. పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్, స్టార్ హీరోయిన్ రష్మికల మధ్య ఏదో జరిగిందని కొందరు చర్చించుకుంటున్నారు.
సుకుమార్ పాన్ ఇండియా లెవల్లో తీసిన మూవీ ‘పుష్ప’.అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్. మొదట్లో ఒక సినిమా తీసి ఆగిపోదాని అనుకున్న సుక్కు పార్ట్ 2 ను కూడా తీస్తున్నాడు. ఆ పనుల్లో ప్రస్తుతం బిజీ అయ్యారు. ఇక పుష్ప సినిమా సందర్భంగా సుకుమార్, రష్మికల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని కొందరు వార్తలు సృష్టిస్తున్నారు. సుక్కు తన పర్సనల్ విషయాలను రష్మికతో షేర్ చేసుకునేవారని కూడా అంటున్నారు.
ఓసారి సుకుమార్ ‘పుష్ప’ లొకేషన్లో ఉండగా ఓ హీరోయిన్ పై హాట్ కామెంట్ చేశాడట. ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు రష్మిక అక్కడే ఉందట. వెంటనే సుకుమార్ చేసిన వ్యాఖ్యలన్నింటినీ వీడియో తీసిందట. ఇప్పుడు ఆ వీడియను బయటపెడుతానంటూ సుకుమార్ ను బ్లాక్ మెయిన్ చేస్తుందట. అయితే రష్మిక ఇదంతా సరదా కోసం చేసిందా? లేక ఇంకేమైనా ఆశిస్తుందా? అని కొందరు కొంటె కుర్రాళ్లు కామెంట్ పెడుతున్నారు.
అదీగాక ఇలా సుకుమార్ ను బ్లాక్ మెయిన్ చేసేలా ఆటపట్టిస్తుందంటే వీరి మధ్య సాన్నిహిత్యం బాగానే ఉందని మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయం ఆనోటా.. ఈ నోటా.. బయటకు వచ్చింది. దీనిపై అటు రష్మిక గానీ.. ఇటు సుకుమార్ కానీ ఏ విధంగా స్పందించడం లేదు. ఇప్పటికైనా చడీ చప్పుడు లేకుండా ఉంటే.. ఇవి నిజమేనా? అని ప్రశ్నలు వేసే వరకు వెళ్లొచ్చు. వెంటనే దీనిపై క్లారిటీ ఇవ్వాలని సినీ ప్రేక్షకులు కోరుతున్నారు.