Theatre Bandh: ప్రస్తుతం ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం చాలా కష్టమైన పని అయిపోయింది మేకర్స్ కి. సాధారణమైన సినిమాలకు ప్రేక్షకులు రావడం లేదు. భారీ బడ్జెట్ గ్రాండియర్ చిత్రాలు విడుదలై, సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంటేనే థియేటర్స్ కి కదులుతున్నారు. లేదంటే నాలుగు వారాల తర్వాత ఎలాగో ఓటీటీ లోకి వచ్చేస్తుంది, అప్పుడు చూసుకోవచ్చులే అనే మైండ్ సెట్ లోకి వచ్చేసారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి బిగ్గెస్ క్రౌడ్ పుల్లర్స్ కి కూడా జనాలు థియేటర్స్ కి పాజిటివ్ టాక్ వస్తేనే కదులుతున్నారు. లేదంటే రెండవ రోజు నుండే థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. అందుకు లేటెస్ట్ ఉదాహరణలు ‘రాజా సాబ్’, ‘హరి హర వీరమల్లు’ మరియు ‘వార్ 2’ వంటి చిత్రాలే. అయితే టాలీవుడ్ కి దండిగా వసూళ్లు వచ్చే సీజన్ ఏదైనా ఉందా అంటే అది సంక్రాంతి సీజన్ మాత్రమే.
ఈ సీజన్ లో సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలకు కనీసం నాలుగు వారాల థియేట్రికల్ రన్ ఉంటుంది. C సెంటర్స్ లో అయితే రెండు వారాల పాటు రన్ ఉంటుంది. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో బయ్యర్స్ పండగ చేసుకున్నారు. దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ C సెంటర్స్ లో సోమవారం తో ఆగిపోయింది. ఇక ఈరోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ C సెంటర్స్ లోని థియేటర్స్ మూత పడనున్నాయి. ఎందుకంటే దగ్గర్లో ఎలాంటి పెద్ద సినిమా లేదు కాబట్టి. మీడియం రేంజ్ హీరోల సినిమాలు, మరియు చిన్న సినిమాలు ఇలాంటి సెంటర్స్ లో రన్ అవ్వవు. ఎందుకంటే జనాలు రారు కాబట్టి.
మళ్లీ ఈ సెంటర్స్ లోని థియేటర్స్ మొత్తం రీ ఓపెన్ అయ్యేది పెద్ద హీరో సినిమాకే. దగ్గర్లో పెద్ద హీరో సినిమా అంటే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మాత్రమే ఉంది. ఈ సినిమా మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రం తోనే మళ్లీ C సెంటర్స్ లోని థియేటర్స్ కళకళలాడబోతున్నాయి. అంటే దీని అర్థం ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే, పెద్ద హీరోల సినిమాలు నాన్ స్టాప్ గా విడుదల అవుతూనే ఉండాలి. లేదంటే థియేటర్స్ మనుగడ కష్టమే. C సెంటర్స్ మాత్రమే కాదు, ఈ రెండు నెలలు మెయిన్ సెంటర్స్ కూడా వచ్చే నెల నుండి ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది.