Infinix 50 Pro Plus: ప్రస్తుత కాలంలో చాలామంది మొబైల్ తోనే ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీలో ఉండే వారితోపాటు సోషల్ మీడియా కంటెంట్స్ సృష్టించేవారు తమకు అనుగుణంగా ఉండే మొబైల్స్ ను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం infinix కంపెనీ ప్రత్యేకంగా మొబైల్ ను 2026 కొత్త సంవత్సరం సందర్భంగా లాంచ్ చేసింది. 250 MP మెయిన్ కెమెరా ఉండడంతో అద్భుతమైన ఫోటోగ్రఫీ కావాలని అనుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అలాగే ఇందులో స్మార్ట్ ఫీచర్స్ తో పాటు బ్యాటరీ వ్యవస్థా మెరుగ్గా ఉంది. ఈ బ్యాటరీ కి ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండడంతో రోజువారి వినియోగదారులతోపాటు ప్రత్యేకంగా మొబైల్స్ కావాలని అనుకునేవారు వారికి ఇది సపోర్ట్ గా ఉండనుంది. ఈ మొబైల్ పూర్తి వివరాల్లోకి వెళ్తే.
Infinix నుంచి కొత్తగా 50 ప్లస్ అనే స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ మొబైల్లో ప్రధానంగా కెమెరా గురించి చెప్పవచ్చు. ఇందులో మెయిన్ కెమెరా 250 MP తో పనిచేస్తుంది. దీంతో ఫోటోగ్రఫీ కావాలని అనుకునే వారికి ఈ కెమెరా కచ్చితంగా ఫోటోలను అందిస్తుంది. ఇందులో ఏఐ ఫీచర్స్ కూడా ఉండడంతో లైటింగ్, కాంట్రాస్ట్ తో కూడిన అద్భుతమైన ఫోటోలను పొందవచ్చు. తక్కువ కాంతి లోను కావలసిన ఫోటోలను అందిస్తుంది. ఫోటోలతోపాటు వీడియో రికార్డింగ్ కోసం కూడా ఈ కెమెరా సపోర్ట్ గా ఉండనుంది.
ఇన్ఫినిక్స్ కొత్త మొబైల్ లో 5,500 mAh బ్యాటరీని చేర్చారు. మీ బ్యాటరీ 100 W. సపోర్టుతో చార్జింగ్ అవుతుంది. ఫాస్ట్ గా చార్జింగ్ కోరుకునే వారికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఒకసారి చార్జింగ్ చేస్తే రోజంతా వినియోగించినా కూడా తక్కువ పర్సంటేజ్ తో డౌన్ అవుతుంది. అంతేకాకుండా డౌన్ టైం తక్కువగా ఉండడంతో ఉద్యోగులు, వ్యాపారులకు అనుగుణంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే బ్యాటరీ ఆప్టిమైజ్ తో ఉండడంవల్ల గేమింగ్, మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి సపోర్ట్ గా ఉండనుంది.
ఏ కొత్త మొబైల్లో 5G కనెక్టివిటీ వేగవంతంగా ఉండనుంది. బ్లూటూత్, వైఫై, GPS వంటి ఆప్షన్లు ఉండడంతో నెట్వర్క్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉండనుంది. సుదూర ప్రాంతాల్లోకి వెళ్లినా కూడా నెట్వర్క్ విషయంలో సపోర్ట్ ఇస్తుంది. ఈ మొబైల్ లో స్మార్ట్ ఫీచర్స్ అనుకూలంగా ఉండాలన్నాయి. ఇందులో 16 జిబి వరకు ర్యామ్ ఉండడంతో వేగవంతంగా ఆపరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకేసారి పలు రకాల యాప్స్ వినియోగించినా కూడా ఎలాంటి భారం పడకుండా ఉంటుంది. డిమాండ్ ఉన్న గేమ్స్ తో పాటు కొన్ని ప్రత్యేకమైన వర్క్స్ కోసం మొబైల్ పై ఎలాంటి భారం పడకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో రూ.31,990 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.