Prabhas: మన టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు విడుదల అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతోంది. ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Global Star Ram Charan), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) వంటి పాన్ ఇండియన్ హీరోలు అయితే ఒక్కో సినిమాకు రెండు నుండి మూడేళ్ళ సమయం తీసుకుంటున్నారు. మహేష్ బాబు ఏడాదికి ఒక చిత్రం కచ్చితంగా చేసేవాడు కానీ, ఇప్పుడు ఆయన రాజమౌళి ‘వారణాసి’ మూవీ తో లాక్ అయ్యాడు. 2027 వరకు మహేష్ సినిమా చూడలేము. అయితే స్టార్ హీరోల్లో ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తున్న హీరోలు ప్రభాస్, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మాత్రమే. బాహుబలి సిరీస్ తర్వాత సాహూ కి ఒక్కటే పెద్ద గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas) ఏడాది కి రెండు సినిమాలు విడుదల చేస్తూ వచ్చాడు. ఈమధ్య కాలం లో ‘కల్కి’ తర్వాత ‘రాజాసాబ్’ కి ఒక్క ఏడాది గ్యాప్ వచ్చింది అంతే.
అది కూడా గత ఏడాది డిసెంబర్ లో విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. ఇదంతా పక్కన పెడితే 2027 వ సంవత్సరం లో ప్రభాస్ నుండి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే ‘స్పిరిట్’ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 5న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలై 5 రోజుల వరకు షూటింగ్ ని జరుపుకుంది. త్వరలోనే డెహ్రాడూన్ లో 15 రోజుల పాటు షూటింగ్ ని జరుపుకోనుంది ఈ చిత్రం. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 2 నుండి ప్రభాస్ ‘కల్కి 2’ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఫిబ్రవరి 2న మొదలయ్యే ఈ కొత్త షెడ్యూల్ 10 రోజుల పాటు జరగనుంది.
ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రానికి కూడా డేట్స్ ని కేటాయించాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ కూడా వచ్చే నెలలోనే మొదలు కాబోతుంది. ఇలా వరుసగా మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ రాబోయే రోజుల్లో క్షణం తీరిక లేకుండా గడపనున్నారు ప్రభాస్. వచ్చే ఏడాది మార్చి 5 న ‘స్పిరిట్’, అదే విధంగా సెకండ్ హాఫ్ లో ‘ఫౌజీ’, ఏడాది చివర్లో ‘కల్కి 2’ చిత్రాలతో సందడి చేయనున్నాడు ప్రభాస్. ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యాక, ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది . ఆ చిత్రం తో పాటు ‘సలార్ 2’ షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.