Ravi Teja: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు మాత్రమే చాలా మంచి క్రేజ్ అయితే ఉంది.ఇక మరి కొంతమంది హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమవుతున్నారు. అయితే అందులో రవితేజ ఒకరు. ప్రస్తుతం రవితేజ పాన్ ఇండియా సినిమాలను చేయడం లేదు. కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమైన సినిమాలను చేసి సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన మరోసారి శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే సినిమాతో డిఫరెంట్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాతో అతనికి గొప్ప ఇమేజ్ దక్కుతుందని అతను భావిస్తున్నట్టుగా తెలుస్తుంది…అయితే రవితేజ తన కెరీర్ లో ఎప్పటికప్పుడు తన పంథా ను మార్చి డిఫరెంట్ సినిమాలు ట్రై చేయాలని చూసినప్పటికి అందులో కొన్ని బెడిసి కొట్టడంతో అతను డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేయడం మానేశాడు. అందుకే రొటీన్ రొట్టా ఫార్ములా సినిమాలు చేస్తూ వచ్చాడు. మొత్తానికైతే ఇప్పుడు తను కరెక్ట్ స్టెప్ తీసుకున్నాడు. ఇండస్ట్రీలో రొటీన్ సినిమాలకు కాలం చెల్లింది…
సినిమాలో ఏదైనా వైవిద్యం భరితమైన ఎలిమెంట్స్ ఉన్నప్పుడే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు… అందులో డిఫరెంట్ గా చెప్పుకునే ఎలిమెంట్స్ లేకపోతే మాత్రం ప్రేక్షకులు ఆ సినిమాని రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు రవితేజ చేసే సినిమాల మీద ప్రతి ప్రేక్షకుడు విమర్శలనైతే చేస్తున్నారు.
అతని అభిమానులను మినహాయిస్తే రవితేజ కి సగటు ప్రేక్షకుల్లో పెద్దగా క్రేజ్ లేదు. ప్రస్తుతం తను తీసుకున్న కొత్త రూట్ అతనికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతకు ముందే డిఫరెంట్ సినిమాలను చేస్తే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగేవాడు అంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ప్రస్తుతం రవితేజ కమర్షియల్ సినిమాలకి పుల్ స్టాప్ పెట్టాడనే అనే వార్తలు వస్తున్నాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ మొత్తానికైతే కొన్ని వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ అటు కమర్షియల్ సినిమాలను చేసుకుంటూ రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కెరియర్ సాఫీగా ముందుకు సాగుతుందని మరి కొంతమంది చెబుతున్నారు…