Lokesh Kanakaraju Vs Nelson: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఇక అందులో భాగంగానే లోకేష్ కనకరాజు లాంటి దర్శకుడు కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో పాన్ ఇండియాలో చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ ను కాపాడుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా ‘కూలీ’ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంటాడని అందరు అనుకున్నప్పటికి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు లోకేష్ కనకరాజు మీద చాలామంది చాలా విమర్శలైతే చేస్తున్నారు. ఎందుకంటే కూలీ సినిమా పెద్ద గా ఆడకపోవడంతో అతన్ని నెల్సన్ తో పోలుస్తూ చాలా వరకు విమర్శలైతే చేస్తున్నారు. ఇక ఇంతకుముందు నెల్సన్ రజనీకాంత్ తో చేసిన ‘జైలర్’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక జైలర్ 2 విషయంలో నెల్సన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఇక జైలర్ 2 సినిమాని కూడా సూపర్ సక్సెస్ గా నిలుపడానికి ఆయన శాయశక్తుల ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఈ విషయంలోనే అటు లోకేష్ ని, ఇటు నెల్సన్ ని ఇద్దరిని పోలిస్తూ లోకేష్ మీద రజినీకాంత్ ఫ్యాన్స్ తీవ్రమైన వ్యతిరేకతను చూపిస్తున్నారు… ఎందుకంటే లోకేష్ కనకరాజు ఎలాంటి బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే సినిమాని చేస్తాడని, కానీ నెల్సన్ మాత్రం స్క్రిప్ట్ మొత్తం చేతిలో పట్టుకున్న తర్వాత సినిమాని చేస్తాడని చెబుతున్నారు.
లోకేష్ మూవీ చేసిన తర్వాత ఆ సినిమాని ఎడిటింగ్ లో చాలావరకు కొన్ని సీన్స్ తో మిక్స్ చేసి కలుపుతూ దాన్ని ఏదో రకంగా బెస్ట్ సీన్ గా చూపించే ప్రయత్నం చేస్తాడు. కానీ తను అనుకున్న పాయింట్ అందులో కన్వే అవుతుందా? లేదా అనే విషయాలను అతను సరిగ్గా పట్టించుకోడని చాలామంది చెబుతున్నారు. కానీ నెల్సన్ మాత్రం ప్రతి సీన్ క్రాస్ చెస్ చేసుకుంటూ తీస్తాడని రజినీకాంత్ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు…
ఇక ఈ రెండు విషయాల్లోనే లోకేష్ – నెల్సన్ ఇద్దరు దర్శకుల మధ్య తీవ్రమైన వ్యతిరేకతలు వస్తున్నాయి. ఇక రజినీకాంత్ అభిమానులు నెల్సన్ ను పొగుడుతూ లోకేష్ కనకరాజు ను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తుండటం విశేషం…లోకేష్ రజినీకాంత్ ఇచ్చిన మంచి అవకాశాన్ని వాడుకోలేకపోయాడు. దాంతో నెల్సన్ మీదనే ఇప్పుడు అందరి చూపులు ఉన్నాయి. మరి ‘జైలర్ 2’ సినిమాతో నెల్సన్ మరోసారి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…