Distributors Gratitude Meet : ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో ‘గేమ్ చేంజర్’ చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. 225 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే, కేవలం 110 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అంటే దాదాపుగా 50 శాతం కి పైగా నష్టాలు అన్నమాట. ఈ సినిమాని కొన్న బయ్యర్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని కూడా కొనడంతో నష్టాల నుండి తప్పించుకున్నారు. పెట్టిన ప్రతీ పైసా కి పది రూపాయిల లాభం తెచ్చిపెట్టిన బ్లాక్ బస్టర్ చిత్రమిది. చాలా అరుదుగా ఇలాంటి సినిమాలు వస్తుంటాయి. అయితే ఈ సందర్భంగా బయ్యర్స్ ఎంతో ఆనందిస్తూ నిర్మాత, దర్శకుడికి కృతఙ్ఞతలు తెలియచేస్తూ నేడు ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ LVR మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
LVR ని ఒక ప్రముఖ మీడియా రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘ఒకప్పుడు మా సినిమాకి ఇంత వచ్చాయి అని మీ డిస్ట్రిబ్యూటర్స్ స్వయంగా చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు మాత్రం ఎందుకు మేము అడిగిన కూడా చెప్పడం లేదు. నష్టాలు వచ్చినా కూడా లాభాలు వచ్చినట్టే చెప్తున్నారు మేము అడిగినప్పుడు’ అని అడగగా, దానికి LVR సమాధానం చెప్తూ ‘ఏమి చేయమంటారు సార్..మా డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి అంతే. నష్టాలు వచ్చిన పైకి లాభాలు వచ్చినట్టే చెప్పుకోవాలి. లేదంటే మాకు తదుపరి చిత్రం ఇవ్వరు’ అంటూ చెప్పుకొచ్చారు. రిపోర్టర్ మరో ప్రశ్న అడుగుతూ ‘గత రెండు మూడేళ్ళ నుండి అన్ని సినిమాలకు పోస్టర్స్ భారీగా వేస్తున్నారు అదంతా నిజమేనా’ అని అడగగా, దానికి LVR సమాధానం చెప్తూ ‘ఫేక్ కలెక్షన్స్ మాత్రమే కాదు..మేము వచ్చిన కలెక్షన్స్ ని చెప్తూ పోస్టర్స్ వేసినా కూడా జనాలు నవ్వుకుంటున్నారు సార్’ అని అంటాడు.
దీనికి అనిల్ రావిపూడి మైక్ అందుకొని ‘పాపం ఆయనేదో మాతో సంతోషాన్ని పంచుకుంటూ ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తే, మీరిక్కడ కాంట్రవర్సీ ప్రశ్నలు అడుగుతున్నారు. సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ఆ ఫోటోలను రకరకాలుగా వాడుకొని ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తారు అవసరమా’ అని అంటాడు. దీనికి దిల్ రాజు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుతాడు. గేమ్ చేంజర్ పోస్టర్ గురించి డైరెక్ట్ గా అడగకపోయినా, పరోక్షంగా ఆ సినిమా గురించే అడిగారని స్పష్టంగా అందరికీ అర్థం అవుతుంది. పాపం రామ్ చరణ్ మూడేళ్ళ కష్టానికి వీళ్ళు కనీస స్థాయిలో కూడా గౌరవం ఇవ్వలేదని, ఒక్క సక్సెస్ రాగానే హీరో ని మర్చిపోయి బయ్యర్స్ తో కూర్చొని జోకులు వేస్తున్నారని అభిమానులు చాలా తీవ్రంగా తమ అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. ఈ ఏడాది మెగా అభిమానులకు ఒక పీడకలగా మారిపోయిందని, రామ్ చరణ్ కం బ్యాక్ ఇవ్వడమే గట్టి సమాధానం అంటూ పోస్టులు వేస్తున్నారు.