స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. యూత్ ఐకాన్. సినిమాల్లోని ఆయన స్టైల్స్‌ను రియల్ లైఫ్‌లో ఎంతో మంది యూత్ ఫాలో అవుతూ ఉంటారు. అంతేకాదు.. ఒక్కో సినిమాలో ఒక్కో స్టైల్ అల్లు అర్జున్‌ది. అందుకే.. ఆయన సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా.. అల్లు అర్జున్–సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతోంది.
Also Read: వేట కూర…వేట కొడవలి కాన్సెప్ట్ ఏంటి నాని!
ఈ సినిమాలో విలన్ల హంగామా ఎక్కువగానే కనిపించనుందని సమాచారం. దాదాపు 9 మంది విలన్లు ఈ సినిమాలో ఉంటారని టాక్. అందులో సునీల్ కూడా ఒకడు. అయితే మెయిన్ విలన్ ఎవరన్నది ఇంకా తేలలేదు. ఆ పాత్ర కోసం విజయ్ సేతుపతి, బాబీ సింహా లాంటి పేర్లు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఆర్యని ఖరారు చేశారని టాక్. తమిళ నటుడైన ఆర్య తెలుగువాళ్లకు సుపరిచితుడే. ‘వరుడు’లో బన్నీకి విలన్ గా నటించింది ఆర్యనే.
Also Read: తెలుగులోనే డైలాగ్స్ చెప్పేస్తున్న అలియా
‘సైజ్ జీరో’లోనూ అనుష్క పక్కన కనిపించాడు. ఇప్పుడు ఆ ఆర్యనే ‘పుష్ప’ కోసం ఎంచుకున్నారని, తనే ప్రధాన విలన్ అని టాక్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నా, మెయిన్ టార్గెట్ తమిళ చిత్ర సీమే. అందుకే.. తమిళం నుంచి ప్రధాన విలన్ ని ఎంచుకోవాలని ముందు నుంచీ భావిస్తున్నారు. అందుకే ఆర్యని ఫిక్స్ చేశారు. ఇంకెంతమంది విలన్ల పేర్లు బయటకు వస్తాయో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్