Yadamma Raju Injury: జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరైన యాదమ్మ రాజు ఆసుపత్రి బెడ్ పై నడవలేని స్థితిలో కనిపించాడు. యాదమ్మ రాజును ఆ పొజిషన్ లో ఫ్యాన్స్ వేదన చెందుతున్నారు. అతనికి ఏమైందని ఆందోళనకు గురవుతున్నారు. యాదమ్మ రాజు పటాస్ షోతో వెలుగులోకి వచ్చాడు. స్టాండప్ కామెడీ షో కాన్సెప్ట్ తో పటాస్ ఈటీవీ ప్లస్ లో ప్రసారమైంది. యాంకర్స్ గా రవి, శ్రీముఖి వ్యవహరించారు. పటాస్ ఓ మోస్తరు ఆదరణ దక్కించుకుంది. యాదమ్మ రాజు తనదైన కామెడీతో ఆకట్టుకున్నారు.
పటాస్ షో ముగియగా పలు బుల్లితెర షోల్లో యాదమ్మ రాజు కామెడీ స్కిట్స్ చేయడం జరిగింది. జబర్దస్త్ నుండి సీనియర్ కమెడియన్స్ తప్పుకోవడంతో యాదమ్మ రాజు అక్కడ కీలక స్థానం దక్కింది. యాదమ్మ రాజు టీమ్ లీడర్ కూడా అయ్యాడు. ఎక్స్ట్రా జబర్దస్త్, జబర్దస్త్ షోలలో యాదమ్మ రాజు సద్దాంతో కలిసి స్కిట్స్ చేస్తున్నాడు. అడపాదడపా చిత్రాలు కమెడియన్ గా అతనికి ఆఫర్స్ వస్తున్నాయి.
కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా యాదమ్మ రాజు ఆసుపత్రి పాలు కావడం అందరినీ షాక్ కి గురి చేసింది. అతడు కాలికి గాయంతో కనిపించాడు. నడవలేని స్థితిలో ఉన్న యాదమ్మ రాజు వీడియోను భార్య స్టెల్లా పోస్ట్ చేశారు. దీంతో ఆయనకు ఏమైందని ఫ్యాన్స్ అడుగుతున్నారు. దీంతో భార్య స్టెల్లా వివరణ ఇచ్చారు.
యాదమ్మ రాజు చిన్నపాటి ప్రమాదానికి గురయ్యారు. ఆయన త్వరలో కోలుకుంటారు. మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. త్వరగా కోలుకోవాలని మీరు పంపిన సందేశాలకు కృతజ్ఞతలు, అని ఆమె కామెంట్ చేశారు. అలాగే గాయపడిన భర్తను ఉద్దేశిస్తూ… నేను నీ పక్కన ఉండగా నీకేం కాదు డియర్, అని కామెంట్ చేసింది. యాదమ్మరాజు ఆసుపత్రిలో ఉన్న వీడియో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా యాదమ్మ రాజు బిగ్ బాస్ తెలుగు 7కి ఎంపికయ్యాడనే ప్రచారం జరుగుతుంది. కంటెస్టెంట్స్ లిస్ట్ లో యాదమ్మ రాజు పేరు కూడా ఉందంటున్నారు. యాదమ్మ రాజు గాయంతో కనిపించిన నేపథ్యంలో అతడు వెళ్లకపోవచ్చనే వాదన మొదలైంది. బిగ్ బాస్ షో మరో నెల రోజుల్లో ప్రారంభం కానుందని సమాచారం.
View this post on Instagram