Homeజాతీయ వార్తలుTelangana Assembly Elections: ఎన్నికలకు కేసీఆర్‌ రెడీ... ఆగస్టులో సంచలన ప్రకటన

Telangana Assembly Elections: ఎన్నికలకు కేసీఆర్‌ రెడీ… ఆగస్టులో సంచలన ప్రకటన

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఇంకా నాలుగు నెలలే. దీంతో అన్ని పార్టీలో కదనరంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంది. ముచ్చటగా మూడోసారి గెలిచి రికార్డు సృష్టించాలని గులాబీ బాస్‌ ఉవ్విల్లూరుతున్నారు. ఇందుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆగస్టులో అభ్యర్థుల లిస్ట్‌..
విపక్షాల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ బాస్‌ ఆలోచన చేస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలోనూ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఈసారి కూడా ఇదే తరహాలో లిస్ట్‌ రిలీజ్‌ చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే గతంలోలా సిట్టింగులందరికీ కాకుండా ఈసారి 30 నుంచి 40 మందిని మారుస్తారని తెలుస్తోంది. ఆగస్టులో అభ్యర్థుల జాబితా ప్రకటించి ప్రచార బరిలోకి దిగాలని గులాబీ బాస్‌ అనుకుంటున్నారు. ఇందు కోసం అవసరమైన కసరత్తును ఫామ్‌హౌస్‌ వేదికగా పూర్తి చేశారు.

చివరి దశకు బదిలీలు..
ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పాతుకుపోయిన అధికారుల బదిలీలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రతీరోజూ బదిలీల ఉత్తర్వులు వస్తున్నాయి. డీఎస్పీలు.. సీఐలు అలాగే ఎన్నికల విధుల్లో భాగమయ్యే ఇతరుల పోస్టింగ్‌లను కేసీఆర్‌ స్వయంగా పరిశీలించి ఓకే చేస్తున్నారు.

సంక్షేమం పరుగులు..
ఇక సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. వీఆర్‌ఏలు కొన్నాళ్లుగా ఆత్మహత్యలు చేసకుంటున్నా పట్టించుకోని కేసీఆర్‌ం తాజాగా వారిని ప్రభుత్వంలో భాగం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వికలాంగుల పెన్షన్‌ రూ.4 వేలకు పెంచారు. ముస్లింలకు రూ. లక్ష సాయం జీవో ఇచ్చారు. బీసీలకు సాయం పంపిణీ చేస్తున్నారు. ఇలా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ శరవేగంగా తీసుకుంటున్నారు.

సర్వే ఆధారంగా టిక్కెట్లు..
అదే సమయంలో పార్టీ టిక్కెట్లపై కసరత్తును దాదాపుగా పూర్తి చేశారు. అన్ని రకాలుగా సమాచారం సేకరించుకున్న తర్వాత కేసీఆర్‌ అభ్యర్థులను ఫైనల్‌ చేస్తున్నారు. ఈ అంశంపై మూడునెలల కిందటే లిస్ట్‌ రెడీ చేసుకున్నారు. ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతున్నారు. ఫైనల్‌ లిస్టులో కనీసం పాతిక మంది సిట్టింగ్‌లకు సీట్లు ఉండవన్న సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే కేటీఆర్, కేసీఆర్‌ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు వారితో వ్యవహరించిన విధానాన్ని బట్టిం టిక్కెట్లపై ఆశలు వదిలేసుకోమని సంకేతాలు ఇచ్చారు.

సంకేతాలతో క్లారిటీ..
ఇటీవల బెల్లంపల్లి పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కేటీఆర్‌ ప్రోత్సహించి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. అదే మహబూబాబాద్‌ వెళ్లినప్పుడు అక్కడ ఎమ్మెల్యే షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోతే కనీసం ఆసక్తి చూపించలేదు. ఇలాంటివి చాలా నియోజకవర్గాల్లో జరిగాయి. దీంతో టిక్కెట్‌ రాదనుకుంటున్న బీఆర్‌ఎస్‌ నేతలకు క్లారిటీ వస్తోంది. అయితే అధికారిక ప్రకటన కోసం.. ఎన్నికల షెడ్యూల్‌ వరకూ వేచిఉండాలని భావిస్తున్నారు. ఉండేవాళ్లు ఉంటారు.. పోయేవాళ్లు పోతారు అన్నట్లుగా ఆగస్టులోనే లిస్ట్‌ ప్రకటించాలని అనుకుంటున్నారు బీఆర్‌ఎస్‌ బాస్‌.

మొత్తంగా కేసీఆర్‌ ఎప్పట్లాగే ఇతర పార్టీలు ఇంకా ప్రిపరేషన్స్‌ కుస్తీలోనే ఉండగానే మరో విజయం కోసం తాను పరుగు ప్రారంభించబోతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular