Bigg Boss 6 Telugu- Inaya Sultana vs Faima: బిగ్ బాస్ హౌస్ లో ప్రతి వారం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూసే కెప్టెన్సీ టాస్కు వచ్చేసింది..ఈ వారం కూడా ఇంటి సభ్యులు చిరుతపులులు లాగానే తలపడ్డారు..కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఈ వారం బిగ్ బాస్ ‘ల్యాడర్ vs స్నేక్’ గేమ్ ని నిర్వహించాడు..ఈ టాస్కులో బిగ్ బాస్ ఇచ్చే బంకమట్టితో ల్యాడర్ మరియు స్నేక్స్ ని నిర్మించాలి..ఇందుకోసం బిగ్ బాస్ ల్యాడర్ టీం మరియు స్నేక్ టీం గా ఇంటి సభ్యులను రెండు భాగాలుగా విభజించాడు.

పాము సౌండ్ వచ్చినప్పుడు ఆ టీం లోని ఒక సభ్యులు ల్యాడర్ టీం లో ఎవరినో ఒకరిని ఎంచుకొని..వాళ్ళని ఎటాక్ చేసి బంక మట్టిని తీసుకోవాలి..అలాగే డైస్ సౌండ్ వచ్చినప్పుడు కూడా ల్యాడర్ టీం సభ్యులు స్నేక్ టీం సభ్యులలో ఎవరినో ఒకరిని ఎటాక్ చేసి వాళ్ళ దగ్గర నుండి బంక మట్టి తీసుకోవాలి..ఫిజికల్ గా ఎక్కువ ఎఫ్ర్ట్స్ పెట్టాల్సిన ఈ టాస్కులో ఇంటి సభ్యులు ‘తగ్గేదేలే’ అనే రేంజ్ లో పోటీ పడ్డారు.
ల్యాడర్ టీం నుండి ఇనాయ ని మరియు స్నేక్ టీం నుండి ఫైమా ని బిగ్ బాస్ సంచాలక్స్ గా పెట్టాడు..కానీ ఇద్దరు టాస్కు ఆడాల్సిందే..ఇక ఇనాయ మరియు ఫైమా మధ్య పెద్ద పోటీ వాతావరణం నెలకొంది..గత కొద్దీ వారాల నుండి వీళ్లిద్దరి మధ్య ఎదో ఒక విషయం లో గొడవలు జరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము..ఇక టాస్కులో ఒకరినొకరు తలపడే పరిస్థితి ఎదురు అవ్వడం తో వ్యక్తిగతంగా తీసుకొని చాలా కసితో ఆడారు..ముందు ఇనాయ ఫైమా మీద ఎటాక్ చెయ్యడానికి వస్తుంది..ఫైమా ఇనాయ ని నిలువరించి తన బంకమట్టిని కాపాడుకుంటుంది..సుమారు అరగంటసేపు ఫైమా ఇనాయని నిలువరిస్తుంది.

శారీరకంగా ఇనాయ తో పోలిస్తే చాలా తక్కువగా ఉండే ఫైమా లో ఇంత బలం ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు..ఇక బిగ్ బాస్ ఆదేశం ప్రకారం ఎవరి ల్యాడర్ లో అయితే తక్కువ బంక మట్టి ఉంటుందో వాళ్ళని టాస్కు నుండి తొలగించాల్సిందిగా ఫైమా కి చెప్తాడు..అప్పుడు ఫైమా ఇనాయ ల్యాడర్ లో తక్కువ బంకమట్టి ఉండడం తో ఆమెని టాస్కు నుండి తొలగిస్తుంది..అలా ఇనాయ ఈ టాస్కు నుండి తప్పుకుంది.