Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తూ గత 50 సంవత్సరాలుగా ఎనలేని గుర్తింపును సంపాదించుకుంటున్న నటుడు రజనీకాంత్… తన కెరియర్ లో ఎన్నో మాస్ సినిమాలను చేసి ప్రేక్షకులను అలరించాడు. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఇప్పటికి యాక్షన్ సినిమాలను చేస్తున్నాడు అంటే రజినీకాంత్ కి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. తన చివరి క్షణం వరకు సినిమాల కోసమే బతుకుతానానికి గతం లో చెప్పిన రజినీకాంత్ ఇప్పుడు దానిని చేసి చూపిస్తున్నాడు… ఈ సంవత్సరం లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో చేసిన ‘కూలీ’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడ్డాడు. కానీ ఇప్పుడు నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న ‘జైలర్ 2’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాననే సంకల్పంతో ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక తమిళ్ డైరెక్టర్ లతోపాటు రజనీకాంత్ తెలుగు దర్శకులతో సైతం సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
తెలుగు సినిమాలను ఎక్కువగా చూస్తానని చెప్పిన రజనీకాంత్ ఇక్కడ ఉన్న దర్శకులలో సుకుమార్ అంటే తనకు చాలా ఇష్టం అంటూ ఒక ఇంటర్వ్యూ lo తెలియజేశాడు. సుకుమార్ ఒక క్యారెక్టర్ ను చాలా సింపుల్గా డిజైన్ చేసుకొని దాని మీదనే బేస్ అయి సినిమాని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి అతని సినిమాలు ఎక్కువగా ప్రేక్షకుల ఆదరణ పొందుతాయని రజనీకాంత్చెప్పాడు.
అందుకే సుకుమార్ అంటే కూడా తనకు చాలా ఇష్టమని అతనితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటానని తమిళ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం… ఇక ప్రస్తుతం సుకుమార్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా కొనియాడుతూ ఉంటారు. కాబట్టి అతను చేసే సినిమాలు కూడా డిఫరెంట్ యాంగిల్ లో ఉంటాయి.
ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా సినిమాలను తీయడం అతనికి మాత్రమే సొంతమని పలువురు సినిమా మేధావులు చాలా సందర్భాల్లో తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ బిజీ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. తను కనుక ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధిస్తే ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి…