ప‌వ‌న్‌-హ‌రీష్ మూవీ స్టోరీ లీక్.. ఫ్యాన్స్ కు గూస్ బంబ్సే!

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ పై ప‌వ‌ర్ స్టార్ అభిమానులకు స్పెష‌ల్ క‌న్స‌ర్న్ ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కు వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న ప‌వ‌న్ కు.. ‘గ‌బ్బ‌ర్ సింగ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు హ‌రీష్‌. అందుకే.. ఆయ‌న‌పై ప్ర‌త్యేక‌మైన ప్రేమ‌ను చూపిస్తుంటారు. అలాంటి.. ఈ కాంబో మ‌ళ్లీ రిపీట్ అవుతోంద‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి.. రాబోయే మూవీ గ‌బ్బ‌ర్ సింగ్ కా బాప్ కావాల‌ని ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ‘హరిహర వీరమల్లు’లో […]

Written By: Bhaskar, Updated On : May 6, 2021 11:17 am
Follow us on

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ పై ప‌వ‌ర్ స్టార్ అభిమానులకు స్పెష‌ల్ క‌న్స‌ర్న్ ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కు వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న ప‌వ‌న్ కు.. ‘గ‌బ్బ‌ర్ సింగ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు హ‌రీష్‌. అందుకే.. ఆయ‌న‌పై ప్ర‌త్యేక‌మైన ప్రేమ‌ను చూపిస్తుంటారు. అలాంటి.. ఈ కాంబో మ‌ళ్లీ రిపీట్ అవుతోంద‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి.. రాబోయే మూవీ గ‌బ్బ‌ర్ సింగ్ కా బాప్ కావాల‌ని ఆశిస్తున్నారు.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో రానాతో కలిసి నటిస్తున్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ రెండు చిత్రాల‌ను కంప్లీట్ చేయాల‌ని భావించిన ప‌వ‌న్‌.. ఉద‌యం ఓ షూట్లో.. మ‌ధ్యాహ్నం మ‌రో సెట్లో పాల్గొన్నారు. చాలా బిజీ షెడ్యూల్ తో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న త‌రుణంలో సెకండ్ వేవ్ త‌రుముకొచ్చి షూటింగులు ఆపేసింది. అంతేకాదు.. ప‌వ‌న్ కూడా కొవిడ్ బారిన ప‌డాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం కోలుకొని రెస్ట్ తీసుకుంటున్న ప‌వ‌ర్ స్టార్‌.. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత మ‌ళ్లీ ఈ రెండు చిత్రాల షూటింగ్ లోపాల్గొంటారు.

ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ సినిమా మొద‌లు కానుంది. ఈ సినిమా ప‌వ‌ర్ స్టార్ 28వ మూవీగా తెర‌కెక్కనుంది. అయితే.. ఎలాంటి క‌థ‌తో ఈ సినిమా రూపొంద‌నుంద‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. గ‌బ్బ‌ర్ సింగ్ వంటి హిట్ ఇచ్చిన హ‌రీశ్‌.. ప‌వ‌న్ ఎలా చూపించ‌బోతున్నాడ‌ని ఫ్యాన్స్ ఎగ్జ‌యిట్ అవుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలోనే సినిమా లైన్ ఏంటో చెప్పేశారు.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీప్ర‌సాద్.

ఓ నేష‌న‌ల్ వెబ్ సైట్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు దేవీ. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌-హ‌రీశ్ మూవీ డిస్క‌ష‌న్ వ‌చ్చింది. దీంతో.. అనివార్యంగా కొన్ని విష‌యాలు వెల్ల‌డించాడు డీఎస్పీ. ఈ సినిమా సూప‌ర్ డూపర్ స్క్రిప్టుతో తెర‌కెక్క‌బోతోంద‌ని చెప్పాడు దేవీ. అభిమానుల అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఉంటుంద‌న్న డీఎస్పీ.. వారిని ఎంత‌గానో ఎగ్జ‌యిట్ చేస్తుంద‌ని చెప్పాడు.

అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించి తాను మ్యూజిక్ ప‌నులు కూడా మొద‌లు పెట్టిన‌ట్టు చెప్పాడు. ఇప్ప‌టికే రెండు పాట‌ల కంపోజింగ్ కూడా కంప్లీట్ అయ్యింద‌ని తెలిపాడు. మిగిలిన సాంగ్స్ వ‌ర్క్ కూడా కొన‌సాగుతోంద‌న్న డీఎస్పీ.. ఫ్యాన్స్ తోపాటుగా తాను కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న‌ట్టు చెప్పాడు. ఈ వివ‌రాలు చెప్పిన కాసేప‌టికే.. దేవీప్ర‌సాద్ వీడియో సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చేసింది.

అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొత్తం ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. అభిమానులు ట్వీట్ల మీద ట్వీట్లు వేశారు. ఆ త‌ర్వాత నేష‌న‌ల్ లెవెల్లో ఈ విష‌యాన్ని ట్రెండ్ చేశారు. #PSPK28 అనే హ్యాష్ ట్యాగ్ ను ఇండియా వైడ్ గా ట్రెండ్స్ లో ఉంచారు. దీంతో.. ప‌వ‌న్‌-హ‌రీష్ మూవీకోసం ఫ్యాన్స్ ఎంత‌గా వెయిట్ చేస్తున్నారో అర్థంమైపోయింది. ఇక‌, ఈ సినిమా మొద‌లైన త‌ర్వాత ప‌రిస్థితి ఇంకెలా ఉంటుందో చూడాలి.