Heroine : డైరెక్టర్ ను చూద్దామని వెళ్లి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారింది.. ఇంతకీ ఆమె ఎవరంటే..?

Heroine మొత్తం మీద అనుకోకుండా హీరోయిన్ అయిన అమ్మడు ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ ను అందుకొని ఇండస్ట్రీలో తన స్టేటస్ ను పెంచుకుంది. ఇప్పటికి కూడా ఈ అమ్మడు హవా అదే విధంగా కొనసాగుతుంది. కానీ సంవత్సరం క్రితం మయోసైటిస్ వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.

Written By: NARESH, Updated On : July 10, 2024 8:36 pm

Samantha Ruthuprabhu

Follow us on

Samantha Ruthuprabhu : సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలవడం కష్టమే. దర్శకులు, నిర్మాతలు, కాస్టింగ్‌ మేనేజర్లు, హీరోలు ఇలా ఎవరి కంట పడ్డ, వాళ్లకి కనెక్ట్ అయినా సినిమా అవకాశాలు అనూహ్యంగా వస్తుంటాయి. కెరీర్ స్టాటింగ్ లో ఒక్క హిట్ పడితే చాలు ఓవర్ నైట్ లోనే స్టార్ హోదా వచ్చేస్తుంది. ఈ హిట్ చాలు కొన్ని సంవత్సరాల పాటు జీవితాన్ని ఎలాంటి టెన్షన్ లేకుండా మార్చేస్తుంది. ఇది హీరోహీరోయిన్ ల విషయంలో ఎక్కువగా జరుగుతుంటుంది. అలాంటి ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రీసెంట్ గా శ్రీలీల, కృతి శెట్టిలు ఒక్క సినిమాతో హిట్ కొట్టి ఇండస్ట్రీలో అనూహ్యంగా స్టార్ స్టేటస్ ను సంపాదించారు. గతంలో ఓ హీరోయిన్ కూడా అదే విధంగా సంపాదించి తెలుగులో మాత్రమే కాకుండా తమిళ ఇండస్ట్రీని కూడా దున్నేసింది. ఆమె ఎవరు అనుకుంటున్నారా? మాయ చేసేసిన సమంత. ‘ఏం మాయ చేసావె`తో హిట్‌ అందుకుని అందరి ఆడియెన్స్ ని మాయ చేసిందనడంలో సందేహం లేదు. ఈ సినిమా తర్వాత చాలా మంది స్టార్లతో నటించింది. కేవలం సీనియర్ హీరోల సరసన తప్ప దాదాపుగా అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది సామ్.

అయితే సినిమాలకు ముందు ఫంక్షన్లలో వెల్‌కమ్ గర్ల్ గా పనిచేసిందట సమంత. ఫ్యాషన్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు, సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మరి సినిమా అవకాశాలు కొందరికి అనుకోకుండా వస్తే కొందరికి కష్టపడితే వస్తాయి. మరి సమంతకు సినిమా ఆఫర్ ఎలా వచ్చిందో తెలుసా? తనకు గౌతమ్‌ మీనన్‌ అంటే చాలా ఇష్టమట. తన ఫేవరేట్‌ డైరెక్టర్‌ గౌతమ్ మీనన్ అని తెలిపింది. ఆయన సినిమాలంటే పిచ్చట సామ్ కు. తను ఎలా ఉంటాడో చూద్దామని ఒకసారి వెళ్లిందట అమ్మడు. కానీ అనూహ్యంగా హీరోయిన్‌గా ఎంపింకైందట సామ్. ఈ విషయాన్ని స్వయంగా తానే వెల్లడించింది.

`ఏం మాయ చేసావె` సినిమా కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి.. ఇష్టమైన దర్శకుడిని చూసే అవకాశం వచ్చిందని భావించిందట సామ్.ఆయనను చూడటానికి మాత్రమే ఆడిషన్స్ కు వెళ్లిందట. ఆ దర్శకుడిని చూస్తే చాలు అనుకుందట. హీరోయిన్ అవ్వాలని, తాను సెలక్ట్ కావాలని అనుకోలేదట. అసలు ఊహించలేదట. కానీ అనుకోకుండానే ఆడిషన్స్ తర్వాత హీరోయిన్‌గా ఎంపికైందట. ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మడు షాక్ అయిందట. ఏమాయ చేసావే రిలీజ్ తర్వాత ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సమంతనే చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మొత్తం మీద అనుకోకుండా హీరోయిన్ అయిన అమ్మడు ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ ను అందుకొని ఇండస్ట్రీలో తన స్టేటస్ ను పెంచుకుంది. ఇప్పటికి కూడా ఈ అమ్మడు హవా అదే విధంగా కొనసాగుతుంది. కానీ సంవత్సరం క్రితం మయోసైటిస్ వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.