OG Movie Heroine Name: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటిస్తున్న ‘ఓజీ'(They Call Him OG) చిత్రం పై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా ఊగిపోతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పవర్ స్టార్ అనే పదం వింటే ఎలాంటి వైబ్రేషన్స్ వస్తుందో , ఓజీ పేరు విన్నప్పుడు కూడా అదే తరహా వైబ్రేషన్స్ వస్తుంది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 25 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ కి సమందించిన ఎడిటింగ్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. రీసెంట్ గానే ‘ఫైర్ స్ట్రోమ్’ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయగా, దానికి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూశాము.
Also Read: రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ లతో పోలిస్తే మహేష్ బాబు కి తెలివి ఎక్కువగా ఉందా..?
పవన్ కళ్యాణ్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి చార్ట్ బస్టర్ సాంగ్ పడింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. యూట్యూబ్ లో కోటి 60 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ పాట ఇప్పటికీ టాప్ 1 లోనే ట్రెండ్ అవుతుంది. ఈ పాట సంగతి పక్కన పెడితే, రెండవ పాట లిరికల్ వీడియో సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇది మెలోడీ సాంగ్ అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. నేడు ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్(Priyanka Mohan) ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తూ, త్వరలోనే రెండవ పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేస్తామంటూ చెప్పుకొచ్చారు మేకర్స్. అంతే కాదు హీరోయిన్ క్యారక్టర్ పేరు ‘కన్మణి’ అని రివీల్ చేశారు. ఈ పేరు వినగానే సోషల్ మీడియా లో అభిమానుల నుండి భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది.
‘కన్మణి’ అనే పేరు తమిళనాడు కి చెందింది. అలాంటి పేరు ని హీరోయిన్ కి ఇందులో ఎందుకు పెట్టారు?, అంటే హీరోయిన్ తమిళనాడు ప్రాంతానికి చెందిన అమ్మాయినా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓజీ చిత్రం లోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం తమిళనాడు లోని మదురై ప్రాంతం లో జరుగుతుందని,అక్కడే హీరో హీరోయిన్ మధ్య పరిచయం ఏర్పడి ఉంటుందని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఇక ఈ మెలోడీ సాంగ్ విషయానికి వస్తే, ఈ పాటకు శ్రేయ గోషాల్ తన గాత్రం అందించగా, బృందా మాస్టర్ కొరియోగ్రఫీ చేసింది. పూణే లోని పచ్చని పొలాల మధ్య, అందమైన శిఖరాల నడుమ ఈ పాట ని అద్భుతంగా చిత్రీకరించారట. మొన్న విడుదలైన ఫైర్ స్ట్రోమ్ పాటకంటే ఈ పాట పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు, మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.