Mahesh Babu Intelligent: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్లలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు ఉన్నారు. ఇక చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లు సీనియర్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకుంటున్నారు… ఇక ఇప్పుడున్న టైర్ వన్ హీరోల్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్లలో రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ ల పోలిస్తే మహేష్ బాబు కి కొంచెం తెలివితేటలు ఎక్కువని చాలా మంది సినిమా మేధావులు చెబుతున్నారు. కారణం ఏంటి అంటే తెలుగులో పోకిరి సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత నుంచి అతనికి బాలీవుడ్లో భారీ ఆఫర్లయితే వచ్చాయి. ఇక అప్పట్లో అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు క్యూ కట్టారు. అలాగే మహేష్ బాబును బాలీవుడ్ కి పరిచయం చేస్తామంటూ చాలా కథలను చెప్పినప్పటికి ఆయన మాత్రం బాలీవుడ్ సినిమా చేయనని తెగేసి చెప్పాడు. దాంతో వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. మహేష్ బాబు తెలుగులోనే సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క పరువును నిలబెట్టే ప్రయత్నం చేశాడు…
Also Read: తెలుగులో ఇప్పటి వరకు ఒకే థియేటర్ లో ఎక్కువ రోజులు ఆడిన సినిమా ఏంటో తెలుసా..?
కానీ రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ లు మాత్రం బాలీవుడ్ దర్శకులను నమ్ముకొని బొక్క బోర్ల పడ్డారు. మరి ఇప్పటికైనా మన తెలుగు హీరోలు వాళ్లతో సినిమాలు చేయకపోవడమే మంచిది. ఇక బాలీవుడ్ వాళ్ళని నమ్మకూడదు అనేది మరోసారి అందరికీ తెలిసి వచ్చింది…
అయితే బాలీవుడ్ వాళ్ళ వైఖరిని ముందే పసిగట్టిన మహేష్ బాబు మాత్రం వాళ్లతో సినిమాలు చేయకుండా వాళ్ళు ఎన్ని కథలు చెప్పినా కూడా వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. మొత్తానికైతే సూపర్ స్టార్ వీటన్నింటినీ ముందే పసిగట్టి మరోసారి ఇంటెలిజెంట్ హీరో అని ప్రేక్షకులందరి చేత ప్రశంసలను అందుకుంటున్నాడు. ఇకమీదట సౌత్ లో ఉన్న ఏ హీరోలు కూడా బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేసే సాహసమైతే చేయరు.
ముఖ్యంగా వాళ్ళు చేసిన సినిమాలు అన్నీ తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించడం లేదు. ఇక వాళ్ళు ఎప్పుడూ మన హీరోలను తక్కువ చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఇక మీదట ఏ స్టార్ హీరో బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ చేసిన కూడా వాటికి తెలుగులో పెద్దగా ఆదరణ అయితే దక్కకపోవచ్చు…