Star Heroine Who Fell in Love with Rajamouli: ఒక సినిమాతో సక్సెస్ ను సాధించడమనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు.. కానీ రాజమౌళి మాత్రం తీసిన అన్ని సినిమాలతో భారీ విజయాలను సొంత చేసుకున్నాడు. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన చేసిన సినిమాలు అక్కడి ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ప్రేక్షకులందరిలో అటెన్షన్ ను క్రియేట్ చేశాడు. అలాగే స్టార్ హీరోల ఇమేజ్ ను హ్యాండిల్ చేయడం అందరివల్ల కాదని దానికి చాలా డెడికేషన్ ఉండాలని చూపించాడు. భారీ బడ్జెట్ సినిమాలు చేయాలంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా అనే ఒక స్థాయి ముద్ర నైతే వేసుకున్నాడు. ఇక స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయడం చాలా పెద్ద టాస్క్ కానీ రాజమౌళి మాత్రం త్రిబుల్ ఆర్ సినిమాతో అలవోకగా ఆ టాస్క్ ను దాటేశాడు. అలాంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కి సిద్ధమవుతుంది.
ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది. తద్వారా ఈ సినిమాతో వాళ్ళు ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ఇక రాజమౌళి కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎలాంటి కాంట్రవర్సీలకు పోకుండా తన పని తాను చేసుకుంటూ వచ్చాడు. తన కెరియర్ ను లీడ్ చేసుకుంటూ వస్తున్నాడు.
Also Read: ప్రశాంత్ నీల్ కి ఇష్టమైన తెలుగు హీరోలు ఇద్దరేనా..?
2000 సంవత్సరంలో ఆయన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా షూట్ చేస్తున్న సందర్భంలో ఆ సినిమాలోని హీరోయిన్ గజాల రాజమౌళి వర్క్ డెడికేషన్, అలాగే అతను ఆర్టిస్టుల మీద తీసుకుంటున్న కేర్, అతను ఆడవాళ్ళకి ఇస్తున్న గౌరవాన్ని చూసి అతన్ని పీకల్లోతుగా ప్రేమించిందట. ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలనుకోని తన ప్రేమ విషయం రాజమౌళికి చెప్పిందట.
కానీ అప్పటికే రాజమౌళి రమా తో ప్రేమలో ఉన్నాడు. కాబట్టి తన ప్రేమ గురించి చెప్పాడట. దాంతో గజాల కొంతవరకు డిసప్పాయింట్ అయిందట. ఇక ఏది ఏమైనా కూడా గజాల రాజమౌళి ని పీకల్లోతుగా ప్రేమించింది అంటూ అప్పట్లో వార్తలైతే వచ్చాయి. దీనిమీద అటు రాజమౌళి, ఇటు గజాల ఎవరు స్పందించలేదు… ఇక మరి కొంతమంది మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వన్నీ కామన్ గా జరుగుతుంటాయని దర్శకుడికి హీరోయిన్ మీద ప్రేమ పుట్టడం సర్వసాధారణం అంటూ సమాధానం చెబుతున్నారు…