Ajith love affair: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలు సైతం వాళ్ళ సినిమాలను తెలుగులో డబ్ చేసి ఇక్కడ మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి నటులు భారీ బడ్జెట్ తో సినిమాలను చేయడమే కాకుండా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక తెలుగులో సైతం సెపరేట్ గా సినిమాలను చేయడంతో వాళ్లు కూడా ఇక్కడ భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నారు.. ఇక రజినీకాంత్ కమల్ హాసన్ ల తర్వాత అజిత్ సైతం కెరియర్ మొదట్లో కొన్ని తెలుగు సినిమాలు చేశాడు. అలాగే ఆయన తమిళంలో చేసిన సినిమాల నుంచి తెలుగులో డబ్ అవుతూ ఉండేవి. రజనీకాంత్ కమల్ హాసన్ లతో పోలిస్తే తెలుగులో ఆయనకు అంత పెద్ద క్రేజ్ అయితే లేదు కానీ మొత్తానికైతే ఆయన సినిమాలను చూడడానికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ప్రస్తుతం ఆయన తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయనకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. అతన్ని ఒక హీరోయిన్ లవ్ చేసిందని కానీ అజిత్ మాత్రం తనని మోసం చేశారంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అసలు ఆ హీరోయిన్ ఎవరు? అజిత్ ఎందుకని తనను మోసం చేయాల్సి వచ్చింది. అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
ఇక వివరాల్లోకి వెళితే తెలుగులో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న మహేశ్వరి కావడం విశేషం…ఆమె అప్పట్లో తెలుగుతో పాటు తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఇక అందులో అజిత్ తో రెండు సినిమాలను చేయడం విశేషం…ఆమెకు మొదటి నుంచి కూడా అజిత్ అంటే క్రష్ ఉండేదట. ఇక అందులో ఆమె అజిత్ తో చేసిన ఒక సినిమా ఫిన్సియల్ ప్రాబ్లమ్స్ వల్ల సంవత్సరం పాటు ఆ సినిమా సెట్స్ మీదనే ఉందట.
మరి ఇలాంటి క్రమంలోనే ఆమె సెట్ లో అజిత్ ను చూస్తూ కూర్చునేదట…ఇక ఏది ఏమైనా కూడా తన క్రష్ అజిత్ అని ఫిక్సయిన తను సినిమా మొత్తం అయిపోయిన తర్వాత తన క్రష్ మీరే అని అజిత్ తో చెబుదాం అనుకుందట. ఇక ఆలోపే ఒకరోజు అజిత్ దగ్గరికి వచ్చి మహేశ్వరి దగ్గరికి వచ్చి మహి నువ్వు నా సొంత సిస్టర్ లాంటి దానివి…నీ లైఫ్ లో నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చిన నా దగ్గరికి రా అని అజిత్ చెప్పారట. దాంతో ఒక్కసారిగా ఆమె అజిత్ మీద పెట్టుకున్న ఆశలన్ని అడియాశలైపోయయాట…
ఎందుకంటే అప్పటివరకు ఆమె ఎవరిని తన క్రష్ గా ఊహించుకోలేదు. కానీ అజిత్ ఒక్కడినే ఉంచుకుంది. ఇక అతను ఫైనల్ గా చెల్లి అనడంతో మహేశ్వరి కి ఏం చేయాలో అర్థం కాలేదట. ఇక ఈ విషయాన్ని జగపతిబాబు హోస్ట్ గా వస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోలో మహేశ్వరి ఓపెన్ గా చెప్పేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న జగపతిబాబు, మీనా, సిమ్రాన్ లాంటివారు నవ్వుకున్నారు…