OG movie first ticket price: ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ హీరోగా వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి ప్రేక్షకులు అతని నుంచి ఒక్క సినిమా వస్తే చాలు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పదవి బాధ్యతను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు. ఇక దాంతో 25వ తేదీన ఓజీ సినిమాని రంగంలోకి దించుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.
ఇక సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన మొదటి తెలుగు టిక్కెట్ ను 112000 రూపాయలకు కొనుగులు చేశారు… కూకట్ పల్లి లోని విశ్వనాధ్ థియేటర్ లో మొదటి టికెట్ ను ఇంత భారీ అమౌంట్ పెట్టీ కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి…
ఇక మొత్తానికైతే పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగానే తన అభిమాని ఒక లక్ష 12 వేల రూపాయలు పెట్టి టిక్కెట్ కొనుగోలు చేశాడంటే మామూలు విషయం కాదు…ఈనెల 25వ తేదీన సినిమా రిలీజ్ అవ్వనున్న నేపద్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటినుంచే భారీ సన్నాహాలైతే చేసుకుంటున్నారు. అంటే మొదటి రోజు ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తుందంటూ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలైతే తెలియజేస్తున్నారు.
మరి పాన్ ఇండియాలో ఇప్పటివరకు ఎవరికీ దక్కినటువంటి మొదటి రోజు రికార్డులను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఓజీ సినిమా రంగంలోకి దిగుతుందట… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూళ్లను రాబడుతోంది అనేది ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారింది… మిగతా హీరోలందరి రికార్డు లను బ్రేక్ చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…