OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఇటీవల వివాదానికి దారి తీసిన పాన్ మసాలా యాడ్ వల్ల బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కంపెనీ KGF2 హీరో యశ్‌ను సంప్రదించింది. కానీ అతడు పాన్ మసాలాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండలేనంటూ తిరస్కరించాడు. గతంలో అల్లు అర్జున్ కూడా ఈ యాడ్‌ను రిజెక్ట్ చేసినట్లు కథనాలు వచ్చాయి. దీంతో సౌత్ హీరోలు రియల్‌గానూ హీరోలే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన రెండు సీజన్లు దుమ్మురేపాయి. తాజాగా.. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించి ఓ వార్త బయటకొచ్చింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ న్యూ సీజన్’ అంటూ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అమెజాన్ ప్రైమ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ‘చెల్లం సర్కి కాల్ చెయ్.. ఈ వార్త నిజమేనని ఆయన చెబుతారు,’ అంటూ ఇంగ్లీష్లో క్యాప్షన్ ఇచ్చారు.
Also Read: Trivikram Srinivas: త్రివిక్రమ్ సినీ కెరీర్ లో బెస్ట్ డైలాగ్స్ ఇవే !

మరో క్రేజీ అప్ డేట్ ఏమిటంటే.. నేడు బాలీవుడ్‌లో రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి టైగర్ ష్రాఫ్ నటించిన హీరోపంతి-2, మరొకటి అజయ్ దేవగన్ నటించిన రన్‌వే 34. ఈ రెండు చిత్రాలు కూడా తీవ్ర నిరాశను కలిగించాయి. టైగర్ చిత్రాలు చూసి చూసి విసుగు చెందిన సినీ ఫ్యాన్స్, హీరోపంతి-2లో కూడా ఫైట్లు తప్ప కథే లేదని తేల్చేశారు. కొంతమంది విమర్శకులైతే 0.5 రేటింగ్ ఇచ్చారు. ఇక రన్‌వే 34 కాస్త పర్వాలేదనిపించగా ఆశించిన వసూళ్లు అయితే లేవు.

అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. జక్కన మలిచిన RRR చిత్రంలో కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలిచింది. రామ్ ఎంట్రీ, భీమ్ ఎంట్రీలో వచ్చిన నేపథ్య సంగీతానికి అభిమానుల కేరింతల హోరు కలిసి వీక్షకులకి రోమాలు నిక్కబొడుచుకున్నాయనే చెప్పాలి. ఈక్రమంలో చిత్ర బృందం అఫీషియల్ OST విడుదల చేసింది. సాధారణంగా సినిమాలో విన్నదానికంటే OSTలో సౌండ్ క్వాలిటీ బావుంటుంది. అందుకే కీరవాణి స్వరపరిచిన ప్రతి బిట్ ఆకట్టుకుంటోంది.

Also Read:Bigg Boss Telugu OTT: అషురెడ్డికి షాకిచ్చిన అఖిల్ మదర్? బిగ్ బాస్ షోలో ఇదే వైరల్