Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ట్రేడ్ లో భారీ అంచనాలను నెలకొల్పిన చిత్రం ‘విశ్వంభర’. ‘బింభిసారా’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ వీడియో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి మూడు లోకాలను చుట్టొచ్చే వీరుడిగా కనిపించబోతున్నాడు. గతంలో కూడా చిరంజీవికి సోషియో ఫాంటసీ సినిమాలు చేసాడు కానీ, ఈ చిత్రం వాటికి పూర్తిగా భిన్నం. అలాంటి కథాంశంతో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా విడుదల కాలేదట. ఇకపోతే ఈ చిత్రంలో ‘హనుమాన్’ క్యారక్టర్ కూడా అత్యంత కీలకం. కథ మొత్తం ‘హనుమాన్’ చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి హనుమాన్ పాత్రతో చిరంజీవి కి కాంబినేషన్ సన్నివేశాలు చాలానే ఉంటాయి.
ఇప్పుడు ఆ హనుమాన్ పాత్రలో ఎవరు నటిస్తారు అనే అంశం పై ఫిలిం నగర్ లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ముందుగా ఈ పాత్ర కోసం దగ్గుబాటి రానా ని తీసుకుందాం అనుకున్నారు. కానీ రానా అయితే చిరంజీవి తో సరిసమానమైన హోదా ఆడియన్స్ కి అనిపించదు అనే ఉద్దేశ్యంతో, ఆయనని కాకుండా ఇప్పటి వరకు టాలీవుడ్ కి పరిచయం కానీ ఆర్టిస్టుతో ఈ క్యారక్టర్ చేయించాలని డైరెక్టర్ వశిష్ఠ చూస్తున్నాడు. అందుకోసం ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ వశిష్ఠ. ఇదే విషయాన్నీ చిరంజీవి దృష్టికి ఆయన తీసుకొని వెళ్లగా, చాలా మంచి ఆలోచన ఒకసారి సన్నీ ని కలిసి కథ చెప్పు, నేను తనతో మాట్లాడుతాను అని చిరంజీవి అన్నాడట. చిరంజీవి మాట్లాడుతాను అని అన్న తర్వాత, సన్నీ డియోల్ ఒప్పుకోకుండా ఎలా ఉంటాడు చెప్పండి. ఈ క్యారక్టర్ ఆయన దాదాపుగా ఖరారు అయిపోయినట్టే, ఇక కేవలం అధికారిక ప్రకటన రావడం ఒక్కటే మిగిలింది.
సన్నీ డియోల్ బాలీవుడ్ లో ఒకప్పుడు అతి పెద్ద యాక్షన్ హీరో. సీనియర్ నటుడు ధర్మేంద్ర డియోల్ పెద్ద కొడుకు. సన్నీ డియోల్ తమ్ముడు మరెవరో కాదు, ‘ఎనిమల్’ చిత్రం లో బాబీ డియోల్ పాత్ర మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ బాబీ డియోల్ కి సన్నీ డియోల్ అన్నయ్య అవుతాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత సన్నీ డియోల్ ‘గద్దర్ 2’ చిత్రంతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఇప్పుడు త్వరలో బాలీవుడ్ లో తెరకెక్కబోతున్న ‘రామాయణం’ లో ఆయన హనుమాన్ క్యారక్టర్ చెయ్యబోతున్నాడు. తెలుగులో విశ్వంభర లో కూడా అదే క్యారక్టర్ చేసే అదృష్టం ఆయనకీ దక్కింది. ఇది కాకుండా సన్నీ డియోల్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హీరో గా నటిస్తున్నాడు. ఇలా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ దూసుకుపోతుంది.