Super Movie Heroine: పాపం ‘సూపర్’ మూవీ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి?..ఆమె లేటెస్ట్ లుక్స్ ని చూసి తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్!

సూపర్' మూవీ హీరోయిన్ అయేషా టకియా కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రీసెంట్ గా ఆమె బ్లూ రంగు చీరలో, పొట్టి జుట్టుతో కనిపిస్తూ ఒక సెల్ఫీ ఫోటో ని అప్లోడ్ చేసింది. దాని క్రింద పైన చెప్పిన విధంగా ఆమె అభిమానులు కామెంట్స్ చేసారు.

Written By: Vicky, Updated On : August 23, 2024 6:02 pm

Super Movie Heroine

Follow us on

Super Movie Heroine: ఒకప్పుడు మనం ఎంతగానో ఆరాధించిన హీరోయిన్ల లేటెస్ట్ లుక్స్ ని చూసి, అయ్యో! ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే ఈ హీరోయిన్ ఇప్పుడు ఇలా తయారయ్యిందేంటి?, అసలు ఏమైంది? అని అనుకోని బాధపడుతూ ఉంటాము. సోషల్ మీడియాలో వాళ్ళు అప్లోడ్ చేసే ఫోటోల క్రింద ఇలాంటి కామెంట్స్ పెడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. సున్నిత మనస్తత్వం ఉండేవారు అసలు తట్టుకోలేరు. సరిగ్గా ‘సూపర్’ మూవీ హీరోయిన్ అయేషా టకియా కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రీసెంట్ గా ఆమె బ్లూ రంగు చీరలో, పొట్టి జుట్టుతో కనిపిస్తూ ఒక సెల్ఫీ ఫోటో ని అప్లోడ్ చేసింది. దాని క్రింద పైన చెప్పిన విధంగా ఆమె అభిమానులు కామెంట్స్ చేసారు. అవి ఆమె మనసుకి బాగా తాకినట్టు ఉంది, అందుకే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ చేసింది. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో ఆమె అకౌంట్ ని వెతుకుతుంటే కనపడడం లేదు. దాదాపుగా ఆమె దశాబ్ద కాలం నుండి సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉంటుంది. ఈమె 2009 వ సంవత్సరం లో ఫర్హాన్ అజ్మీ ని పెళ్ళాడి సినిమాలకు టాటా చెప్పింది.

Super Movie Heroine(2)

ఈమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అలాగే ఫర్హాన్ అజ్మీ మరెవరో కాదు, సమాజ్ వాదీ పార్టీ అబూ అజ్మీ కుమారుడు. భర్త కోసం ఈమె ముస్లిం మతానికి మారింది. అయితే సినిమాలకు దూరం అయ్యినప్పటికీ కూడా, సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ ఉండేది. అభిమానులకు తనకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండేది. అలా నిత్యం అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉండే ఆమె, ఇప్పుడు అకస్మాత్తుగా ఇంస్టాగ్రామ్ నుండి తప్పుకోవడం ఆమె అభిమానులకు అత్యంత బాధని కలిగిస్తున్న విషయం. సినీ సెలెబ్రిటీలు కూడా మనలాంటి మనుషులే, వాళ్లకి కూడా మనలాగే కొన్ని కామెంట్స్ చూస్తే బాధ కలుగుతూ ఉంటుంది. నెటిజెన్స్ ఈ విషయాన్నీ కాస్త గమనించాలి. సెలెబ్రిటీలు కదా, వాళ్ళని ఏమైనా అనేయొచ్చు,ట్రోల్ చెయ్యొచ్చు అనుకోవడం సరికాదు.

ఇక అయేషా టకియా విషయానికి వస్తే ఈమె ‘టార్జాన్: ది వండర్ కార్’ అనే బాలీవుడ్ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాలు చేసింది కానీ, అవి అనుకున్న స్థాయిలో ఆమెకి పేరు తీసుకొని రాలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈమె నాగార్జున దృష్టిలో పడింది. వెంటనే తాను హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘సూపర్’ చిత్రం లో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా, అయేషా టకియా ని చూసిన ఆడియన్స్ ప్రతీ ఒక్కరు ఎవరు ఈ అమ్మాయి ఇంత అందం గా ఉంది అనుకునేవారు. ఈ సినిమా ద్వారానే హీరోయిన్ అనుష్క కూడా వెండితెర అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె నెగటివ్ షేడ్ క్యారక్టర్ చేసిన సంగతి తెలిసిందే. అందం విషయం లో ఈ సినిమా వరకు అనుష్కని కూడా డామినేట్ చేసింది అయేషా. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె తెలుగులో నటించలేదు, బాలీవుడ్ లోనే స్థిరపడి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.