Homeఎంటర్టైన్మెంట్Rashmi Gautam: రష్మీకి కోట్ల ఖరీదైన విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో... ఆ...

Rashmi Gautam: రష్మీకి కోట్ల ఖరీదైన విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన స్టార్ హీరో… ఆ కామెడీ షో వేదికగా మేటర్ లీక్?

Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ కి ఒక స్టార్ హీరో ఖరీదైన విల్లా గిఫ్ట్ గా ఇచ్చారట. ఇది నిజమేనా అంటూ ఇంద్రజ అడగడం జరిగింది.దీంతో రష్మీకి ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చిన ఆ హీరో ఎవరు? ఎందుకు ఇచ్చారు? అనే చర్చ మొదలైంది. మేటర్లోకి వెళితే శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ కి రాజ్ తరుణ్ తో పాటు అహనా పెళ్ళంట వెబ్ సిరీస్ టీమ్ వచ్చారు. అహనా పెళ్ళంట సిరీస్ నవంబర్ 19 నుండి జీ తెలుగులో స్ట్రీమ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షోకి వచ్చారు. బావగారు బాగున్నారా థీమ్ తో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు.

Rashmi Gautam
Rashmi Gautam

అలాగే షోలో సెలబ్రిటీలపై యూట్యూబర్స్ క్రియేట్ చేసిన థంబ్ నైల్స్ ప్రదర్శించారు. వాటిలో రష్మీకి సంబంధించిన ఒక యూట్యూబ్ థంబ్ నైల్ స్క్రీన్ పై వేశారు.ఆ థంబ్ నైల్ లో రష్మీకి విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన ప్రముఖ హీరో అని రాసి ఉంది. హీరో ఫేస్ బ్లర్ చేసి, రష్మీ ఫోటో హాట్ గా పబ్లిష్ చేశారు. ఈ థంబ్ నైల్ చూసిన జడ్జి ఇంద్రజ… నీకు విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన ఆ హీరో ఎవరు రష్మీ అని అడిగారు. దానికి రష్మీ ఏదో చెప్పారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

ఈ క్రమంలో రష్మీకి విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన ఆ హీరో ఎవరని, జనాలు తలలు బాదుకుంటున్నారు. అయితే అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. కారణం… ఇది సెన్సేషన్ కోసం, వ్యూస్ కోసం క్రియేట్ చేసిన థంబ్ నైల్. యూట్యూబర్స్ హెడ్డింగ్స్, నిరాధార కథనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది నటులను వీరు వ్యూస్ కోసం తన హెడ్డింగులతో, ఎడిట్ చేసిన ఫొటోలతో చంపేశారు. ఎవరో యూట్యూబర్ రష్మీపై ఇలాంటి గాసిప్ క్రియేట్ చేసి థంబ్ నైల్ వదిలారు. అది శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళ వరకు వచ్చేసింది.

Rashmi Gautam
Rashmi Gautam

మరోవైపు రష్మీ లేటెస్ట్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. దీంతో మళ్ళీ ఆమెకు నిరాశే ఎదురైనట్లు ఉంది. అప్పట్లో రష్మీకి వరుసగా హీరోయిన్ ఆఫర్స్ వచ్చాయి. పరాజయాల నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. అయితే ఆమెకు బుల్లితెర షోస్ ఉన్నాయి. ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మీ సందడి చేస్తున్నారు. మళ్ళీ సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో రష్మీకి మంచి రోజులు వచ్చినట్లే.

రష్మీకి కోట్ల ఖరీదైన విల్లా గిఫ్ట్ || Star Hero Gives Villa Gift To Anchor Rashmi || Anchor Rashmi
Netizens About Bigg Boss 6 Sri Satya || Sri Satya Elimination || Bigg Boss || Oktelugu Entertainment
ఊహించని షాక్ ఇచ్చిన తమన్నా! || Tamannaah denied her marriage rumours || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version